వారానికో సినిమా.. అలా పంచుకున్నారు?

ఈ ఏడాదికి సంబంధించి పెద్ద సినిమాల హంగామా ముగిసింది. ఎఫ్3తో ఆ కోటా పూర్తయింది. ఇక మిగిలినవన్నీ మీడియం రేంజ్ సినిమాలు, చిన్న సినిమాలు మాత్రమే. ఇప్పుడీ సినిమాలన్నీ 'ఒక వారం నీది, ఒక…

ఈ ఏడాదికి సంబంధించి పెద్ద సినిమాల హంగామా ముగిసింది. ఎఫ్3తో ఆ కోటా పూర్తయింది. ఇక మిగిలినవన్నీ మీడియం రేంజ్ సినిమాలు, చిన్న సినిమాలు మాత్రమే. ఇప్పుడీ సినిమాలన్నీ 'ఒక వారం నీది, ఒక వారం నాది' అన్నట్టు చక్కగా రిలీజ్ డేట్స్ సర్దుబాటు చేసుకున్నాయి. ఎలాంటి పోటీ లేకుండా చక్కటి ప్లానింగ్ తో వస్తున్నాయి. జూన్ నెల మొత్తం ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

జూన్ మొదటి వారంలో మేజర్ సినిమా వస్తోంది. మరో తెలుగు సినిమాతో దీనికి పోటీ లేదు. కమల్ విక్రమ్ సినిమా అదే రోజు వస్తున్నప్పటికీ తెలుగు వరకు పోటీ లేదనే చెప్పాలి. ఇక రెండో వారంలో 'అంటే సుందరానికి' సినిమా వస్తోంది. ఇక్కడ కూడా నాని సినిమాకు పోటీ ఏం లేదు. మూడో వారంలో విరాటపర్వం వస్తోంది. రామారావు ఆన్ డ్యూటీ పోస్ట్ పోన్ అవ్వడంతో రానా సినిమాకు కూడా సోలో రిలీజ్ దక్కినట్టయింది.

జూన్ నాలుగో వారానికైతే ప్రస్తుతానికి అన్నీ చిన్న సినిమాలే షెడ్యూల్ అయి ఉన్నాయి. మరో మీడియం రేంజ్ సినిమా ఆ స్లాట్ లోకి రావొచ్చు. అలాంటిదేమైనా జరిగితే గ్యాంగ్ స్టర్ గంగరాజు, సమ్మతమే లాంటి సినిమాలు సైడ్ అయిపోతాయి. ఒకవేళ వచ్చినా ఇబ్బంది లేదు.

సో.. ఎలా చూసుకున్నా ఈ నెలలో రాబోతున్న ప్రతి సినిమాకు దాదాపు సోలో రిలీజ్ దక్కినట్టే. అటు జులైలో కూడా పరిస్థితి ఇలానే ఉంది. థాంక్యూ, వారియర్, పక్కా కమర్షియల్, కార్తికేయ 2 లాంటి సినిమాలు చెరొక వారం పంచుకున్నాయి. అలా కరోనా తర్వాత రిలీజ్ డేట్స్ సర్దుబాటులో ఏర్పడిన గందరగోళం ఇన్నాళ్లకు క్లియర్ అయింది.