Advertisement

Advertisement


Home > Movies - Movie News

మూవీ ఫ్లాప్ అయింది.. ఇకనైనా బ్లెస్సింగ్స్ తీసుకో

దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మరోసారి విరుచుకుపడ్డారు కేఏ పాల్. కోర్టులో కేసు వేసి మరీ సినిమాలో తన పేరు లేకుండా చేశానని, ఇకనైనా తనతో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు. చీప్ పబ్లిసిటీ కోసం పాకులాడితే శపించేస్తానంటున్నారు పాల్.

"నేను కోటి రూపాయలు ఇవ్వలేదని, వంద కోట్ల రూపాయలతో సినిమా తీయలేదని నన్ను లాగావు. ఇప్పుడేమైందో చూడు. నాతో పెట్టుకున్నవాడు ఎవ్వడూ బాగుపడలేదు. ట్రంప్ మాట తప్పితే ఆయన్ను లాగాను. మాట వినలేదు కాబట్టి ట్రంప్ ను బయటపెట్టాను. ఇదే చీప్ పబ్లిసిటీ నువ్వు (వర్మ) అమెరికాలో చేసుంటే నీ అంతు చూసేవాడ్ని."

అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాలో తన పేరు లేదని, తన ఫొటో కూడా లేదని అంటున్నారు కేఏ పాల్. చివరికి తన పేరును కూడా యథాతథంగా వాడలేకపోయారని, ఇది వర్మపై తను సాధించిన విజయమని చెబుతున్నారు. ఇప్పటికైనా ఆర్జీవీ సిగ్గు తెచ్చుకోవాలని.. దమ్ముంటే నేరుగా తనతో తలపడాలని డిమాండ్ చేశారు.

"నువ్వు మార్పు చెందు. నాతో పెట్టుకోకు. ఈ మూవీపై ఎందుకింత కోపమో తెలుసా సిగ్గులేనోడా. ఆరోజు ముంబయిలో నీకు ఏం చెప్పాను. ఏసు ప్రభువుపై ఎఫ్ అనే పదం 3సార్లు వాడావు. అందుకే నేను కోప్పడ్డాను. ప్రభువు శాపానికి, నా శాపానికి గురవుతావు నువ్వు. మూవీ కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇకనైనా నా బ్లెస్సింగ్స్ తీసుకో."

ఇకనైనా వర్మ బుద్ధి తెచ్చుకోవాలని.. కుటుంబాన్ని, కూతుర్ని చక్కగా చూసుకోవాలని సూచించారు పాల్. అమెరికా అధ్యక్షుడు, ఇండియా ప్రెసిడెంట్ తో రెగ్యులర్ గా బిజీగా ఉండే తన సమయాన్ని వేస్ట్ చేయొద్దని ఆర్జీవీని హెచ్చరించారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?