Advertisement

Advertisement


Home > Movies - Movie News

కబీర్ సింగ్ రిలీజైంది.. అంతా ఊహించిందే జరిగింది

కబీర్ సింగ్ రిలీజైంది.. అంతా ఊహించిందే జరిగింది

బాలీవుడ్ లో కబీర్ సింగ్ రిలీజైంది. అర్జున్ రెడ్డి సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీని అక్కడి ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఆసక్తి టాలీవుడ్ లో కూడా నెలకొంది. నిన్న థియేటర్లలోకి వచ్చిన కబీర్ సింగ్ కు మిక్స్ డ్ రిజల్ట్ వచ్చింది. కొంతమంది సినిమా చెత్తగా ఉందని కూడా పెదవి విరిస్తే, మరికొంతమంది మాత్రం అద్భుతంగా ఉందని మెచ్చుకుంటున్నారు.

నిజానికి ఈ టాక్ ను కబీర్ సింగ్ యూనిట్ ముందే ఊహించింది. ఎందుకంటే అర్జున్ రెడ్డి రిలీజైన మొదటి రోజు కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి టాక్ వచ్చింది కాబట్టి. అర్జున్ రెడ్డి రిలీజైన మొదటి రోజు, మొదటి ఆట పూర్తయ్యేసరికి సినిమా మరీ బోల్డ్ గా ఉందన్నారు చాలామంది. నిడివి ఎక్కువైందన్నారు మరికొంతమంది. ఇలాంటి సినిమాలు ఆడవని చాలామంది క్రిటిక్స్ కూడా అభిప్రాయపడ్డారు. కట్ చేస్తే, అర్జున్ రెడ్డి కల్ట్ మూవీగా నిలిచింది.

ఇప్పుడు బాలీవుడ్ లో కబీర్ సింగ్ కూడా అదే స్టేటస్ అందుకుంటుందని యూనిట్ ధీమాగా ఉంది. మొదటి రోజు వచ్చిన స్పందనను పెద్దగా పట్టించుకోవడం లేదు. వీకెండ్ గడిచేసరికి సినిమా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉంది. 

రీసెంట్ గా వచ్చిన దేదే ప్యార్ దే సినిమాకు కూడా ఇలానే విడుదలైన రోజు ఫ్లాప్ అన్నారు. కట్ చేస్తే, వీకెండ్ నాటికి సినిమా పుంజుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో నడుస్తున్న ట్రెండ్ ప్రకారం, కబీర్ సింగ్ కూడా అదే విధంగా నిలదొక్కుకుంటుందని యూనిట్ నమ్మకం. సినిమా బాగాలేదంటూ వచ్చిన రివ్యూలు నిజమౌతాయా లేక యూనిట్ నమ్మకం నిజమౌతుందా తేలాలంటే మరికొన్ని గంటల సమయం పడుతుంది.

బాబుగారూ.. 'మీరు ఓడిపోవడం ఏమిటయ్యా!'

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?