తన చెల్లెలు పెళ్లి చేసుకుని సెటిలైనా.. తను మాత్రం పెళ్లి జోలికి వెళ్లలేదు కాజల్ అగర్వాల్. కాజల్ సహ హీరోయిన్లోల కొందరు పెళ్లిళ్లు చేసుకుని కూడా సినిమాల్లో నటిస్తూ ఉన్నారు. అయితే కాజల్ మాత్రం వస్తున్న అవకాశాలను ఉపయోగించుకుంటూ సాగుతూ ఉంది. పెళ్లి ఆలోచన ఉంది కానీ, ఇప్పుడే కాదన్నట్టుగా కాజల్ మాట్లాడుతూ వస్తోంది.
తన తల్లిదండ్రులు తన పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నారని కాజల్ చెబుతూ వచ్చింది కొన్నాళ్ల కిందటి వరకూ. అయితే సీనియర్ హీరోల సరసన అవకాశాలు పెరగడంతో మళ్లీ ఆ ప్రయత్నాలను పట్టాలెక్కించినట్టుగా లేరు. ఈ నేపథ్యంలో కాజల్ అగర్వల్ తన పెళ్లి విషయంలో మరోసారి స్పందించింది.
తనకు ఎలాంటి వాడు కావాలో చెప్పింది. తనకు కాబోయే భర్త తనలాంటి వాడు మాత్రం కాకూడదని అంటోంది. వైవిధ్యభరితమైన వాడు కావాలని.. కాజల్ అంటోంది. అలా నచ్చినవాడు కనిపిస్తే తను పెళ్లి చేసుకోవడానికి రెడీ అని కాజల్ అగర్వాల్ చెబుతోంది!