మూడు కోట్ల రూపాయల కారు కొన్న స్టార్ హీరో!

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ తన కొత్త కారులో ముంబైలో షికారు చేస్తూ కనిపించాడు. ఇంకా పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ రాని కారులో రణ్ వీర్ షికారు చేస్తూ, కొత్త కారు…

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ తన కొత్త కారులో ముంబైలో షికారు చేస్తూ కనిపించాడు. ఇంకా పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ రాని కారులో రణ్ వీర్ షికారు చేస్తూ, కొత్త కారు కొన్న విషయాన్ని చాటుకున్నాడు. లాంబోర్ఘినీ యూరస్ మోడల్ కారు అది. దాని విలువ కనీసం మూడు కోట్ల రూపాయల ఉంటుందని నిపుణులు చెబుతూ ఉన్నారు.

ఇటీవలే రణ్ వీర్ సింగ్ ఈ కారును కొన్నట్టుగా తెలుస్తోంది. దాన్ని తనే నడుపుతూ ముంబై వీధుల్లో ఈ హీరో షికారు కొట్టి వార్తల్లోకి వచ్చాడు. ఒక బాలీవుడ్ స్టార్ హీరోకి మూడుకోట్ల రూపాయలు పెట్టి కారు కొనడం పెద్దదేమీ కాకపోవచ్చు.

ఒక్కో సినిమాకు రణ్ వీర్ తీసుకునే పారితోషకంలో నాలుగోవంతు విలువ కూడా చేయదు ఈ కారు. అయితే మూడు కోట్ల రూపాయలు పెట్టి కారు కొనడం అనేది ఇండియన్స్ కు పెద్ద విశేషమే. అదెవరైనా ఆ స్థాయి కారు కొనడం విశేషమే. రణ్ వీర్ గ్యారేజ్ లో ఇలాంటి కార్లు మరిన్ని కూడా ఉండవచ్చు!

నరసింహారెడ్డి ఘన కీర్తిని తెలియజేసేలా..