పాకిస్తాన్ కు వెళ్లేది లేదు.. స్పష్టం చేసిన కాంగ్రెస్ నేత!

పాకిస్తాన్ లో భాగంగా ఉన్న సిక్కుల పవిత్ర స్థలం కర్తార్ పూర్ కారిడార్ ఓపెనింగ్ కు తను వెళ్లే సమస్యే లేదని ప్రకటించారు  పంజాబ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్.…

పాకిస్తాన్ లో భాగంగా ఉన్న సిక్కుల పవిత్ర స్థలం కర్తార్ పూర్ కారిడార్ ఓపెనింగ్ కు తను వెళ్లే సమస్యే లేదని ప్రకటించారు  పంజాబ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్. కర్తార్ పూర్ కారిడార్ ఓపెనింగ్ కు కాంగ్రెస్ నేతలకు ఆహ్వానం అందించింది పాకిస్తాన్ ప్రభుత్వం. ప్రత్యేకించి సిక్కు నేతలను ఆహ్వానించింది. అందులో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ ను కూడా పాక్ ప్రముఖులు ఆహ్వానించారు. ఆ విషయాన్ని వారు అధికారికంగా ప్రకటించారు.

ఆ కార్యక్రమానికి మన్మోహన్ హాజరవుతారని ప్రచారం సాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో అమరీందర్ సింగ్ స్పందించారు. తను కర్తార్ పూర్ కు వెళ్లే సమస్యే లేదని ఆయన తేల్చి చెప్పారు. అలాంటి ఉద్దేశమే లేదని స్పష్టం చేశారు. అలాగే మన్మోహన్ సింగ్ కూడా వెళ్లకపోతేనే మంచిదని అమరీందర్ అన్నారు. ఆ ఆలోచనను మన్మోహన్ మానుకోవాలని అన్నారు.

అయితే ఈ విషయంలో మన్మోహన్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ ఫంక్షన్ కు ప్రభుత్వ ముఖ్యులను, ప్రధానిని పాకిస్తాన్ ఆహ్వానించడం లేదు. కాంగ్రెస్  సిక్కునేతలను మాత్రం ఆహ్వానిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అమరీందర్ ఇలా స్పందించారు.

నరసింహారెడ్డి ఘన కీర్తిని తెలియజేసేలా..