ఆచార్య ఆశీస్సులు తీసుకున్న కాజల్ కిచ్లు

పెళ్లి చేసుకొని, కొన్ని రోజులు హనీమూన్ కూడా ఎంజాయ్ చేసిన హీరోయిన్ కాజల్, మళ్లీ షూటింగ్స్ తో బిజీ అయింది. ఇప్పటికే ఓ తమిళ సినిమాను స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ, ఇవాళ్టి నుంచి…

పెళ్లి చేసుకొని, కొన్ని రోజులు హనీమూన్ కూడా ఎంజాయ్ చేసిన హీరోయిన్ కాజల్, మళ్లీ షూటింగ్స్ తో బిజీ అయింది. ఇప్పటికే ఓ తమిళ సినిమాను స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ, ఇవాళ్టి నుంచి ఆచార్య సినిమా సెట్స్ పైకి వచ్చేసింది.

ఇదిలా ఉండగా.. ఆచార్య సెట్స్ కు భర్త గౌతమ్ తో కలిసి వచ్చింది కాజల్. కొత్తగా పెళ్లైన దంపతులకు చిరంజీవి శుభాకాంక్షలు అందించి, ఆశీర్వదించారు. అంతేకాదు.. రెండు దండలు తెప్పించి, తన సమక్షంలో మరోసారి వాళ్లకు మినీ-పెళ్లి జరిపించారు. చిరంజీవి సమక్షంలో కాజల్-గౌతమ్ మరోసారి దండలు మార్చుకున్నారు. కలిసి కేక్ కట్ చేశారు.

ప్రస్తుతం ఆచార్య సినిమాకు సంబంధించి చిరంజీవి-కాజల్ పై ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు. కోకాపేటలో వేసిన భారీ సెట్ లో ఈ షూటింగ్ జరుగుతోంది. కాజల్ రాకతో ఈ సినిమా షూటింగ్ మరింత ఊపందుకోనుంది.

మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్, కొణెదల ప్రొడక్షన్స్ బ్యానర్లపై వస్తున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడు. రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. అతడి పాత్ర నిడివిని కూడా కాస్త పెంచారు. 

Click Here For Photo Gallery

ఈ సెగ దేశం మొత్తానికి పాకుతుందా?