ఆటో తో అదృష్టం ప‌రీక్షించుకోనున్న ర‌జ‌నీ!

కొత్త‌గా రిజిస్ట‌ర్ అయిన పార్టీల‌కు సంబంధించిన పేర్లు, గుర్తుల వివ‌రాల‌ను ప్ర‌క‌టించిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. త‌మిళ‌నాడుకు సంబంధించి ఒక ఆస‌క్తిదాయ‌క‌మైన ప్ర‌క‌ట‌న చేసింది. ర‌జ‌నీకాంత్ అనే వ్య‌క్తి ద‌ర‌ఖాస్తు మేర‌కు.. మ‌క్క‌ల్ సేవై…

కొత్త‌గా రిజిస్ట‌ర్ అయిన పార్టీల‌కు సంబంధించిన పేర్లు, గుర్తుల వివ‌రాల‌ను ప్ర‌క‌టించిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. త‌మిళ‌నాడుకు సంబంధించి ఒక ఆస‌క్తిదాయ‌క‌మైన ప్ర‌క‌ట‌న చేసింది. ర‌జ‌నీకాంత్ అనే వ్య‌క్తి ద‌ర‌ఖాస్తు మేర‌కు.. మ‌క్క‌ల్ సేవై క‌ట్చి అనే పార్టీ పేరును, ఆ పార్టీకి ఆటో రిక్షా గుర్తును కేటాయిస్తూ ఎన్నిక‌ల సంఘం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

మ‌రి ఈ ర‌జ‌నీకాంత్ అనే వ్య‌క్తి.. త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ యేనా? అనే విష‌యం గురించి ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న లేదు. త‌మిళ‌నాడు నుంచి ధ‌ర‌ఖాస్తు, ర‌జ‌నీకాంత్ అనే పేరు, మ‌క్క‌ల్ సేవై క‌ట్చి అని పార్టీ పేరు, దాని గుర్తు ఆటో రిక్షా అనే ప్ర‌క‌టన నేప‌థ్యంలో.. అది సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పార్టీ పేరు, అది ఆయ‌న పార్టీ గుర్తు అనే ప్ర‌చారం ఊపందుకుంటోంది.

అయితే విష‌యంలో ఇంకా ర‌జ‌నీకాంత్ రాజ‌కీయ ఆంత‌రంగికులు ఎవ‌రూ ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు. ర‌జ‌నీకాంత్ పార్టీకి పేరు ఖ‌రారు అయిన విష‌యాన్ని కానీ, గుర్తు ఖ‌రారు అయ్యింద‌నే విష‌యాన్ని కానీ ప్ర‌క‌టించ‌లేదు. అయితే ఈ ద‌ర‌ఖాస్తులో మొద‌టి గుర్తుగా ర‌జ‌నీకాంత్ బాబా స్టైల్ ను అడిగార‌ట‌.

రెండో ఛాయిస్ కింద ఆటో రిక్షా గుర్తును అడిగార‌ట‌. ఈ నేప‌థ్యంలో ఇది  క‌చ్చితంగా న‌టుడు ర‌జ‌నీకాంత్ నుంచి దాఖ‌లైన ద‌ర‌ఖాస్తే అనే విష‌యంపై స్ప‌ష్ట‌త వ‌స్తోంది. ర‌జ‌నీకాంత్ పార్టీ సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తుంద‌ని మొద‌ట ప్ర‌చారం జరిగింది. అయితే చివ‌ర‌కు ఆటో రిక్షా గుర్తుకు వ‌చ్చిన‌ట్టుగా ఉన్నారు.

ఆటో రిక్షాతో ర‌జ‌నీకాంత్ కు మంచి అనుబంధ‌మే ఉంది. భాషా సినిమాలో ఆటో డ్రైవ‌ర్ గా న‌టించి సూప‌ర్ హిట్ కొట్టాడు సూప‌ర్ స్టార్. ర‌జ‌నీకాంత్ ఆటో డ్రైవ‌ర్ కోట్ లో ఉన్న స్టిల్స్ ఇప్ప‌టికీ పాపుల‌రే! ఆటోవాన్ని ఆటో వాన్ని అంటూ ర‌జ‌నీ పాట ఎంత పాపుల‌రో వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి ఆటోతో ర‌జ‌నీకాంత్ అదృష్టం ప‌రీక్షించుకునేలా ఉన్నారు!

ఇక ఇదే గుర్తును ఆ మ‌ధ్య క‌ర్ణాట‌క‌లో మ‌రో స్టార్ హీరో ఉపేంద్ర పొందిన‌ట్టుగా ఉన్నాడు. ఉపేంద్ర పెట్టిన పార్టీకి ఆటో డ్రైవ‌ర్ గుర్తు వ‌చ్చిన‌ట్టుంది. ఆ పార్టీ మీటింగులో కూడా అంతా ఆటో డ్రైవ‌ర్ కోట్ లు వేసుకుని పాల్గొన్నారు. అయితే చివ‌ర‌కు ఆ పార్టీ నుంచి ఉపేంద్రే బ‌య‌ట‌కు వ‌చ్చాడు. మ‌రో పార్టీ అన్నాడు కానీ.. అలాంటి ప్ర‌య‌త్నాలేవీ జ‌రుగుతున్న‌ట్టుగా లేదు.

ఈ సెగ దేశం మొత్తానికి పాకుతుందా?