ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవలే వివాహ బంధంతో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశారు. పెళ్లి మల్లెలు ఇంకా వాడనేలేదు. పెళ్లి తాలూకూ మూడ్ నుంచి ఆమె కుటుంబం, బంధువులు, మిత్రులు ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నారు.
కానీ ఆమె మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా సెట్స్‌లో ఎప్పుడెప్పుడు అడుగు పెడతామా అని ఆరాట పడుతున్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో పెళ్లి అనేది ఓ మధుర ఘట్టం. పెళ్లి తర్వాత అన్నిటికి దూరంగా జీవిత భాగస్వామితో కలిసి కొంత కాలం ఏకాంతంగా గడుపుదామని ఏ జంటైనా ఆశిస్తుంది.
కాజల్ అగర్వాల్ హీరోయిన్ అయినప్పటికీ …. పెళ్లికి సంబంధించి ఒక సగటు ఆడపిల్ల ఎలా కలలు కని ఉంటుందో, ఆమె భావనలు కూడా అట్లే ఉండి ఉంటాయి.
అయితే తాను ఎంచుకున్న సినీ రంగం పట్ల కాజల్ ఎంత నిబద్ధతతో ఉంటారో ఓ విషయాన్ని చెప్పుకుందాం. షూటింగ్‌ల్లో పాల్గొనాలని నిర్ణయించుకోవడమే ఆమె కమిట్‌మెంట్‌కు నిదర్శనం.
కాళ్ల పారాణి ఆరక ముందే కాజల్ అగర్వాల్ మాత్రం పెళ్లి సందడికి తాత్కాలిక విరామాన్ని ఇచ్చి వెంటనే సెట్స్‌లోకి అడుగుపెట్టేందుకు నిర్ణయించుకున్నారు.
పెళ్లికి ముందు ఇచ్చిన కమిట్‌మెంట్స్‌ను గాలికి విడిచి పెట్టి నిర్మాతలకు నష్టం చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారామె. దీంతో ముందు కుదుర్చుకున్న ఒప్పందం మేరకు సినిమా షూటింగ్‌లో పాల్గొనాలని కాజల్ అగర్వాల్ రెడీ అవుతన్నారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 10న షూటింగ్‌లో పాల్లొనేందుకు ఆమె ఏర్పాట్టు చేసుకున్నారు. తమిళంలో ‘హే సినామికా’ పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో హీరో దుల్కర్ సల్మాన్ సరసన కాజల్ నటిస్తున్నారు.
లాక్‌డౌన్ అనంతరం ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ రీస్టార్ట్ చేశారు. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నట్టు సంబంధిత యూనిట్‌కు కాజల్ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. కాజల్ నిబద్ధతపై చిత్ర పరిశ్రమ హర్షం వ్యక్తం చేస్తోంది.