మరికొన్ని గంటల్లో బ్యాచిలర్ లైఫ్ కు బై చెప్పేసి వైవాహిక జీవితంలోకి ఎంటర్ అవ్వబోతోంది చందమామ కాజల్. తన ఫ్యామిలీ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లును రేపు ఆమె పెళ్లి చేసుకోబోతోంది. దీనికి సంబంధించి పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి.
ముంబయిలోని కాజల్ ఇంట్లోనే జరుగుతున్న ఈ వేడుక మెహందీ ఫంక్షన్ తో మొదలైంది. చేతికి మెహందీ పెట్టుకున్న ఫొటోల్ని కాజల్ స్వయంగా పోస్ట్ చేసింది. ఆ ఫొటోలకు ఆమె ఎలాంటి క్యాప్షన్ ఇవ్వలేదు కానీ, కాజల్ కు పెళ్లి కళ వచ్చేసిందనే విషయం ఆ ఫొటోలు చూస్తే అర్థమైపోతుంది.
అటు పెళ్లికొడుకు గౌతమ్ కిచ్లు ఇంట్లో కూడా సంప్రదాయబద్ధంగా పెళ్లివేడుక మొదలైంది. కొన్ని పూజలు నిర్వహించి గౌతమ్ చేతికి కంకణం కట్టారు. పూర్తిగా కుటుంబ సభ్యుల సమక్షంలో కాజల్ పెళ్లి వేడుక జరుగుతోంది.
పెళ్లి తర్వాత కాజల్-గౌతమ్ కలిసి నివశించే ఇల్లు కూడా రెడీ అయింది. తామిద్దరి కోసం కొత్త ఇల్లు సిద్ధం చేసినట్టు స్వయంగా ప్రకటించిన కాజల్, ఆ మేరకు కొత్త ఇల్లు సర్దుతున్న ఫొటోను కూడా గతంలో పోస్టు చేసింది.