నిజంగానే పాన్ వరల్డ్ మూవీ ఇది

క్లారిటీ వచ్చేసింది. కల్కి సినిమా కథ, థీమ్, జానర్ పై జనాలకు ఐడియా వచ్చింది. అందరి అంచనాలకు తగ్గట్టు హాలీవుడ్ రేంజ్ కు ఒక్క ఇంచ్ కూడా తగ్గకుండా తెరకెక్కింది కల్కి సినిమా. కొద్దిసేపటి…

క్లారిటీ వచ్చేసింది. కల్కి సినిమా కథ, థీమ్, జానర్ పై జనాలకు ఐడియా వచ్చింది. అందరి అంచనాలకు తగ్గట్టు హాలీవుడ్ రేంజ్ కు ఒక్క ఇంచ్ కూడా తగ్గకుండా తెరకెక్కింది కల్కి సినిమా. కొద్దిసేపటి కిందట విడుదలైన ట్రయిలర్ చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమౌతుంది.

సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ కు మైథలాజికల్ టచ్ ఇస్తూ తెరకెక్కింది కల్కి. సినిమాలో కీలక పాత్రలన్నింటినీ ట్రయిలర్ లో పరిచయం చేశారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపిక పదుకోన్, దిశా పటానీ, రాజేంద్రప్రసాద్.. ఇలా కీలక పాత్రలన్నీ కనిపించాయి. బ్రహ్మానందంతో కామెడీ కూడా చూపించారు.

ఇవన్నీ ఒకెత్తయితే, ట్రయిలర్ చివర్లో వచ్చిన కమల్ హాసన్ షాక్ ఇచ్చారు. ఆయన లుక్, చెప్పిన డైలాగ్ అన్నీ బాగున్నాయి. ఇక ప్రభాస్ విషయానికొస్తే, యూనిట్స్ (డబ్బు) కోసం ఫైట్స్ చేసే వ్యక్తిగా ప్రభాస్ ను చూపించారు. ఓ కీలకమైన పని కోసం మిగతా పాత్రలన్నీ కలిసి ప్రభాస్ ను ఎలా ఒప్పించాయి, ఆ పని ఏంటనేది ట్రయిలర్ లో ట్విస్ట్. ట్రయిలర్ లో విజువల్స్, గ్రాఫిక్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆర్ట్ వర్క్.. అన్నీ ఇంటర్నేషనల్ రేంజ్ లో ఉన్నాయి.

ట్రయిలర్ చూస్తుంటే, చాలా హాలీవుడ్ సినిమాల నుంచి నాగ్ అశ్విన్ ప్రేరణ పొందినట్టు కనిపిస్తోంది. అయితే వాటికి ఇండియన్ టచ్ ఇవ్వడంలో ఈ దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఈ జానర్ లో, ఈ స్థాయి సినిమా రావడం ఇండియాలో ఇదే ఫస్ట్ టైమ్. అందుకే కల్కి ప్రాజెక్టు స్పెషల్ గా మారింది. 27న థియేటర్లలోకి వస్తోంది కల్కి .