కల్కి అనేది ఫ్యూచరిస్టిక్ సినిమా. దర్శకుడు నాగ్ అశ్విన్ అయిదారు వందల ఏళ్ల తరువాత భూమి ఎలా ఉండబోతోందో అన్నది ఊహించి ఆలోచించి చేస్తున్న సినిమా. ఇలాంటి సినిమాలు హాలీవుడ్ లో వచ్చాయి. కానీ మనదైన సినిమా ఎలా వుంటుంది అన్నది ఆసక్తికరం.
ఎప్పుడూ వెస్ట్‌లోనేనా, మనకు కూడా ఇలాంటి సినిమాలు కావాలి కదా అని నాగ్ అశ్విన్ నే చెప్పారు. అందువల్ల ఫలానా సినిమా రిఫరెన్స్.. అని గూగుల్ చేయాల్సిన పని లేదు. నిజానికి అలాంటి సినిమాలు చాలానే వున్నాయి. ELYSIUM అనే సినిమాలో భూమి కలుషితం అయిపోవడం, నివాసయోగ్యం కాకపోవడం, డబ్బున్న వారంతా ఆకాశంలో సకల భోగాలు అనుభవించే స్పేస్ షిప్ లాంటి దాంట్లో వుండడం అనే పాయింట్ వుంది.
అలాగే మరో సినిమాలో పవిత్ర గ్రంధాన్ని భూమి మీద నుంచి మరో దగ్గరకు తీసుకెళ్లే హీరో అనే పాయింట్ వుంది. సో.. అందువల్ల కల్కి కథ ఏమిటి అన్నది క్వశ్చను కాదు. నాగ్ అశ్విన్ ప్రెజెంటేషన్ ఎలా వుండబోతోంది అన్నదే పాయింట్.
మహానటి కథ కొత్తదా? అందరికీ తెలిసిన మహనటి సావిత్రి కథ. కానీ ఓ బయోపిక్ అంటే ఎలా తీయాలో ఓ రూల్ బుక్ ను తయారుచేసినట్లు తీసాడు నాగ్ అశ్విన్. అందువల్ల కల్కి సినిమా అంటే నాగ్ అశ్విన్ సమర్ధత.. నాగ్ అశ్విన్ విజన్.. నాగ్ అశ్విన్ ప్రెజెంటేషన్.
కల్కి సినిమా రాకుండానే నాగ్ అశ్విన్ ఓ విషయంలో మార్కులు కొట్టేసారు. ఎలా అంటే… అసలు కాశీ నగరాన్ని కథలో కీలకంగా తీసుకోవడంలో. భారతీయులకు, ముఖ్యంగా హిందువులకు కాశీ కన్నా గొప్ప నగరం లేదు. ఈ భూమి మీద మొదటి నగరం కాశీ అంటారు. అందుకే భూమి మీద ఆఖరి నగరం కాశీ అనే డైలాగ్ తో ట్రయిలర్ స్టార్ చేసాడు. మొదటి నగరం ఆఖరి నగరంగా ఎలా మారింది.. దాన్ని ఎలా కాపాడుకున్నారు అన్నదే కదా కీలకం.
అక్కడే ఇంకో పాయింట్ ఏమిటంటే కాశీ పవిత్ర నగర క్షేత్ర పాలకుడు ఎవరు? కాలభైరవుడు. ఈ కథలో హీరో పేరు… భైరవ. అంటే కథలో రక్షకుడు భైరవుడే.. ఆ కాలభైరవుడు అన్నమాట. ఆ విధంగా దర్శకుడు నాగ్ అశ్విన్ డివోషనల్ టచ్ ఇచ్చారు. ఇక పురాణాల లెక్క ప్రకారం భూమి మీద చిరంజీవులుగా వున్న వారిలో ఒకరైన అశ్వద్దామ పాత్రను కూడా తీసుకువచ్చారు అమితాబ్ పాత్రతో.
ఇక మిగిలిన ప్రశ్న.. తెరమీద చూసి తెలుసుకోవాల్సింది.. కల్కి ఎవరు?
దీపిక కడుపులో వున్న బిడ్డనే కల్కినా? అలా అయితే అసలు కల్కి కథ అంతా ద్వితీయ భాగంలోనే చూడాలా? అన్ని విధాలుగా ఆసక్తి జనరేట్ చేస్తూ కల్కి తొలిభాగాన్ని ముగిస్తారన్నమాట దర్శకుడు.
ఫినిషింగ్ టచ్ ఏమిటంటే..
తొలి సినిమా, మలి సినిమా ల్లో కీలకపాత్రల్లో కనిపించిన విజయ్ దేవరకొండ నే కల్కి అవుతారా? అన్నది?