ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా ట్రయిలర్ చూశారా.. దాదాపు అంతా చూసే ఉంటారు. మరి కల్కి ట్రయిలర్-2 (రిలీజ్ ట్రయిలర్) చూశారా? అదేంటి కల్కి రెండో ట్రయిలర్ వచ్చిందా? అది రాలేదు.. లీక్ అయింది.
అవును.. సోషల్ మీడియాలో కల్కి ట్రయిలర్-2 లీక్ అయింది. చాలామంది దీన్ని చూస్తున్నారు. అయితే అలా లీక్ అయిన ట్రయిలర్ లో ఆడియో లేదు, కేవలం విజువల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. అయినప్పటికీ జనాలు ఎంజాయ్ చేస్తున్నారు.
దీనికి ఓ కారణం ఉంది. కల్కి ట్రయిలర్-1లో నేపథ్యాన్ని, పాత్రల్ని పరిచయం చేసిన దర్శకుడు నాగ్ అశ్విన్.. రిలీజ్ ట్రయిలర్ ను మాత్రం పూర్తిగా యాక్షన్ ఎలిమెంట్స్ తో నింపేశాడు. హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి ఫైట్స్. అందుకే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేకపోయినా జనం ఎగబడి చూస్తున్నారు.
అయితే ఈ ట్రయిలర్ ను అధికారికంగా ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఇంకా మేకర్స్ వెల్లడించలేదు. ఇంతకీ ఈ సెకెండ్ ట్రయిలర్ ఎలా లీక్ అయిందో తెలుసా?
ముంబయిలో కల్కి ప్రీ-రిలీజ్ ఫంక్షన్ చేశారు. అక్కడ ఈ ట్రయిలర్ ను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఆ టైమ్ లో యూట్యూబ్ లైవ్ కూడా కట్ చేశారు. కానీ అక్కడున్న వ్యక్తుల్లో ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అదీ సంగతి.