ఆమె నటించకపోతే నో అన్నాడంట

విజయశాంతి నటిస్తేనే ఈ సినిమా చేస్తానని, లేకపోతే ప్రాజెక్టు పక్కనపెడదామని కల్యాణ్ రామ్ క్లియర్ గా చెప్పేశాడట

విజయశాంతి నటించకపోతే ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమా చేయనని దర్శకుడికి స్పష్టంగా చెప్పేశాడట హీరో కల్యాణ్ రామ్. ఈ విషయాన్ని అతడే స్వయంగా బయటపెట్టాడు. సినిమా ప్రమోషన్ లో భాగంగా విడుదల చేసిన ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.

నందమూరి కల్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో ప్రదీప్ చిలుకూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ముందు ఆ కథను కల్యాణ్ రామ్ కు వినిపించాడట. కథ కల్యాణ్ రామ్ కు బాగా నచ్చిందంట. అయితే కీలకమైన తల్లిపాత్ర నెరేషన్ ఇస్తున్నప్పుడు అతడికి మదిలో విజయశాంతి మాత్రమే మెదిలారంట.

అందుకే విజయశాంతి నటిస్తేనే ఈ సినిమా చేస్తానని, లేకపోతే ప్రాజెక్టు పక్కనపెడదామని కల్యాణ్ రామ్ క్లియర్ గా చెప్పేశాడట. ఆ తర్వాత ఈ కథను విజయశాంతి ఒప్పుకోవడంతో సినిమా పట్టాలపైకి వచ్చింది.

ఏప్రిల్ 18న ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమాలో ఐపీఎస్ వైజయంతి పాత్రలో కనిపించారు విజయశాంతి. ఈ క్యారెక్టర్ కోసం ఆమె ఏకంగా 10 కిలోల బరువు తగ్గారంట.

2 Replies to “ఆమె నటించకపోతే నో అన్నాడంట”

  1. నీకొకటి గతి లేదు కానీ నో చెప్పడం కూడానా, ఏమి గొప్పలు చెప్పుకుంటారా బాబు

Comments are closed.