కొన్ని రోజుల కిందటి సంగతి. పవన్ కల్యాణ్ సినిమా లైన్లో ఉందని తెలిసి కూడా రాబిన్ హుడ్ రిలీజ్ ను అదే తేదీకి పెట్టుకున్నారు. మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ కూడా అప్పుడేనని ప్రకటించుకున్నారు. దీంతో హరిహర వీరమల్లు సినిమా ఆ డేట్ కు రాదని అంతా ఫిక్స్ అయిపోయారు.
అందరూ ఊహించినట్టే జరిగింది. పవన్ సినిమా వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి ఈ సినిమాపై అనుమానాలు పెరిగాయి. శ్రీవిష్ణు హీరోగా నటించిన సింగిల్ అనే సినిమాను మే 9కు విడుదల చేయాలని ప్రాధమికంగా నిర్ణయించారు. అయితే ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు.
ఆ తేదీకి పవన్ సినిమా ఉందని తెలిసి కూడా మేకర్స్ ఈ తేదీపై చర్చలు సాగిస్తున్నారంటే దానర్థం, పవన్ సినిమా రిలీజ్ డౌటే. ఈ సినిమానే కాదు, నవీన్ చంద్ర నటిస్తున్న మరో చిన్న సినిమా కూడా అదే తేదీకి అనుకుంటున్నారు.
చూస్తుంటే, హరిహర వీరమల్లు సినిమా మే 9కి వచ్చేది కూడా అనుమానంగానే కనిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి పవన్ ఇంకో 5-6 రోజులు కాల్షీట్లు ఇస్తే సరిపోతుంది. కానీ ఆ 6 రోజులు ఎడ్జెస్ట్ చేయడానికి పవన్ దగ్గర టైమ్ లేదు.
ప్రస్తుతం ఆయన ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. పవన్ మరో వారం రోజుల్లో సెట్స్ పైకి వస్తే, చెప్పిన తేదీకి హరిహర వీరమల్లు వస్తుంది, లేదంటే సింగిల్ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ పడుతుంది.
జాయిన్ కావాలి అంటే