ఇలా కూడా సక్సెస్ అందుకోలేకపోయింది

నాలుగేళ్లుగా పరిశ్రమలో కొనసాగుతున్న ఈ బ్యూటీ, ఇప్పటివరకు సరైన సక్సెస్ అందుకోలేకపోయింది.

అడుగుపెట్టడమే రాంగ్ టైమ్ లో ఇండస్ట్రీలో అడుగుపెట్టినట్టుంది కేతిక శర్మ. నాలుగేళ్లుగా పరిశ్రమలో కొనసాగుతున్న ఈ బ్యూటీ, ఇప్పటివరకు సరైన సక్సెస్ అందుకోలేకపోయింది. చివరికి ఐటెంసాంగ్ కూడా ఆమె కెరీర్ కు ఆక్సిజన్ అందించలేకపోయింది.

పూరి జగన్నాధ్ కొడుకు నటించిన రొమాంటిక్ సినిమాతో తెలుగు తెరపైకొచ్చింది కేతిక శర్మ. ఆ సినిమా డిజాస్టర్. ఆ తర్వాత లక్ష్య, రంగరంగ వైభవంగా సినిమాలు చేసింది. అవి కూడా ఫ్లాపులే.

ఎన్నో ఆశలతో చేసిన బ్రో సినిమా ఆమె కెరీర్ కు బొత్తిగా కలిసిరాలేదు. ఇప్పటివరకు కేతిక నటించిన పెద్ద సినిమా ఇదే. అదే ఫ్లాప్ అవ్వడంతో ఇండస్ట్రీ పట్టించుకోవడం మానేసింది.

ఇక హీరోయిన్ గా అవకాశాలు రావని గట్టిగా ఫిక్స్ అయిన తర్వాత రాబిన్ హుడ్ సినిమాలో ఐటెంసాంగ్ చేసింది కేతిక. వివాదాస్పద డాన్స్ మూమెంట్ చేసింది. ఆ వివాదమే కాదు, సినిమా కూడా ఆమెకు కలిసిరాలేదు.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉన్న ఒకే ఒక్క మూవీ శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న ‘సింగిల్’. ఈ సినిమా ఆమె కెరీర్ ను డిసైడ్ చేసే మూవీగా మారిపోయింది.

One Reply to “ఇలా కూడా సక్సెస్ అందుకోలేకపోయింది”

Comments are closed.