హీరోయిన్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్?

ఈనెల 16వ తేదీన అభినయ, సన్నీ వర్మ పెళ్లి చేసుకోబోతున్నారు. పెళ్లి ఎక్కడనేది ఇంకా బయటకు రాలేదు.

హీరో విశాల్ తో పెళ్లి అంటూ పుకార్లు వచ్చినప్పుడు అసలు మేటర్ బయటపెట్టింది హీరోయిన్ అభినయ. తను ఆల్రెడీ ప్రేమలో ఉన్నానన ప్రకటించింది.

అలా ప్రకటించిన కొన్ని రోజులకే ఎంగేజ్ మెంట్ చేసుకుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు తన కాబోయే భర్తను కూడా పరిచయం చేసింది. ఈ నెల్లోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతోంది అభినయ.

ఈనెల 16వ తేదీన అభినయ, సన్నీ వర్మ పెళ్లి చేసుకోబోతున్నారు. పెళ్లి ఎక్కడనేది ఇంకా బయటకు రాలేదు. భీమవరంలోనే పెళ్లి ఉంటుందా లేక చెన్నైలో పెళ్లి చేసుకుంటారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

దాదాపు పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు అభినయ-సన్నీ. వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా ఆమెకు ఎంతో అండగా నిలబడ్డాడు సన్నీ. తనను బాగా అర్థం చేసుకున్న సన్నీని పెళ్లాడాలని అభినయ ఫిక్స్ అయింది. సన్నీ వర్మ అసలు పేరు కార్తీక్ రాజు.

One Reply to “హీరోయిన్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్?”

Comments are closed.