సురేష్ బాబు… కిం కర్తవ్యమ్?

చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు సురేష్ బాబు ఓపెన్‌గా దానిని తప్పు పడుతూ ఓ మాట కూడా అనలేదు అన్నదే కారణం అని వినిపిస్తోంది.

విశాఖ రామానాయుడు స్టూడియోలో వినియోగించకుండా వదిలిన అదనపు భూములను వెనక్కి ఎందుకు తీసుకోకూడదో చెప్పండి అంటూ నోటీస్ రెడీ అవుతోంది. ఇది విశాఖ జిల్లా కలెక్టర్ చెప్పిన మాట. ఎందుకిలా? రామానాయుడు స్టూడియో విషయంలో ఎందుకు ప్రభుత్వం ఇంత పట్టుదలగా వుంది? వైఎస్ జగన్ కావాలని తను కొంత స్థలం కొనుక్కోవడం కోసం, సురేష్ బాబు మీద వత్తిడి చేసి కొన్ని ఎకరాల స్థలాన్ని కన్వెర్షన్ కోసం ఒప్పించారు. ఈ వ్యవహారం అంతా చంద్రబాబు అండ్ కో కు తెలియంది కాదు. ఇందులో సురేష్ బాబు తప్పేమీ లేదు. పైగా సురేష్ బాబు తెలుగుదేశం మద్దతుదారు.

గతంలో ఆయన తండ్రి తెలుగుదేశం ఎంపీగా వున్నారు. సురేష్ బాబు దగ్గర బంధువులు తెలుగుదేశంలో వున్నారు. అయినా కూడా తెలుగుదేశం ఈ దిశగా ఎందుకు వెళ్తోంది?

రాజకీయ వర్గాల బోగట్టా ప్రకారం చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు సురేష్ బాబు ఓపెన్‌గా దానిని తప్పు పడుతూ ఓ మాట కూడా అనలేదు అన్నదే కారణం అని వినిపిస్తోంది. చంద్రబాబు ఈ విషయంలో ఎలా ఉన్నా, లోకేష్‌కు కాస్త కోపంగా వుందని తెలుస్తోంది. తాము కష్టంలో ఉన్నప్పుడు తమ పక్కన నిలబడిన వారు, ఓపెన్‌గా ఖండించిన వాళ్లే తమ వాళ్లు, ఖండించని వాళ్లు తమ వాళ్లే కాదనే భావన లోకేష్‌కు గట్టిగా తెలుస్తోంది.

నిజానికి ప్రభుత్వం తలుచుకుంటే భూములు వినిమయ మార్పిడికి ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని రద్దు చేసి ఊరుకోవచ్చు. స్టూడియో లేదా తత్ సంబంధిత పనులకే వాడమని చెప్పొచ్చు. అలా చేయకుండా భూములు వెనక్కి తీసుకోవాలి అనుకుంటున్నారు అంటే ఆలోచించాల్సిందే. ఆ రోజుల్ల ప్రభుత్వ రేటు ఎకరా అయిదులక్షలు. ఇప్పుడు చాలా ఎక్కువ. ఓపెన్ మార్కెట్ అయితే కోట్లకు కోట్లు. లేదా మరే టూరిజం ప్రాజెక్ట్‌కు అయినా ఇచ్చుకోవచ్చు.

నోటీస్ అందితే సురేష్ బాబు చేయగలిగేది ఒక్కటే. స్టూడియో నిర్మాణానికే వాడతామని చెప్పి. ఒకటి రెండు కోట్లు ఖర్చు చేసి కొన్ని నిర్మాణాలు అందులో చేపట్టవచ్చు. ఇలా చేయడానికి ప్రభుత్వం అనుమతించాల్సి ఉంటుంది. అలా అనుమతించాలి అంటే సురేష్ బాబు తరపున, తెలుగుదేశంతో సన్నిహిత సంబంధాలున్న ఆయన బంధువులు సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది.

ఇలాంటి వాటికి చంద్రబాబు సరే అనే అవకాశం వుంది. ఆయన మెంటాలిటీ ప్రకారం. కానీ లోకేష్ యువకుడు. ఇలాంటి వాటి కన్నా, గతంలో ఇలా చేసారు అనే కోపమే ఎక్కువ డామినేట్ చేసే అవకాశం వుంది. కొద్ది రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది.

ప్రభుత్వం పట్టుదలగా ముందుకు వెళ్తే, అసలు సంగతి ఏదో వున్నట్లు. లేదంటే టీ కప్పులో తుపాను మాదిరిగా ముగిసినట్లు.

11 Replies to “సురేష్ బాబు… కిం కర్తవ్యమ్?”

  1. స్టూడియో కోసం కేటాయించిన భూమిని రియల్ ఎస్టేట్ కోసం ఉపయోగిస్తానంటే ప్రభుత్వం ఊరుకోవాలా ?

  2. “వైఎస్ జగన్ కావాలని తను కొంత స్థలం కొనుక్కోవడం కోసం, సురేష్ బాబు మీద వత్తిడి చేసి కొన్ని ఎకరాల స్థలాన్ని కన్వెర్షన్ కోసం ఒప్పించారు.”..innocent fellow…all he wanted was little bit of land in Vizag to impress queen…lol

Comments are closed.