‘రాజు’ వెనక జరిగిన అసలు కథ ఇదీ

మ్యాడ్ స్క్వేర్ పనుల్లో పడిపోవడంతో, కల్యాణ్ కూడా ఆ కథపై హక్కులు వదిలేసుకున్నాడు.

కొన్ని సినిమాలు అలా-ఇలా తిరిగి ఎలా మారతాయో ఎవ్వరూ ఊహించలేరు. కథలు మారడమే కాదు, కొన్ని సందర్భాల్లో చేతులు కూడా మారిపోతుంటాయి. ‘అనగనగ ఒక రాజు’ కథ కూడా ఇలాంటిదే.

లెక్కప్రకారం నవీన్ పొలిశెట్టి, దర్శకుడు కల్యాణ్ శంకర్ కాంబినేషన్ లో ఈ సినిమా రావాల్సి ఉంది. అయితే సెకండాఫ్ నవీన్ కు నచ్చలేదు. మారుద్దామన్నాడు. కల్యాణ్ కుదరదన్నాడు. అలా సమయం గడిచిపోయింది.

నిజానికి ఈ కథను త్రివిక్రమ్ ఆల్రెడీ ఫైన్ ట్యూన్ చేశారు. దర్శకుడితో ఒక రోజుంతా కూర్చొని మార్పుచేర్పులన్నీ పూర్తి చేశారు. కానీ నవీన్ కు నచ్చలేదు. ఈ గ్యాప్ లో ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా రిలీజ్ అవ్వడం, ఆ తర్వాత నవీన్ కు యాక్సిడెంట్ అవ్వడం జరిగిపోయాయి.

అయితే యాక్సిడెంట్ టైమ్ లో నవీన్ పొలిశెట్టి స్వయంగా ఈ కథపై కూర్చున్నాడు. కథను ఓన్ చేసుకొని తనే స్వయంగా మార్పుచేర్పులు చేసుకున్నాడు. ఆ తర్వాత దర్శకుడ్ని కూడా తనే వెదికిపెట్టుకున్నాడు. పనిలోపని హీరోయిన్ ను కూడా మార్చేశాడు.

అలా కల్యాణ్ శంకర్ చేయాల్సిన ఆ సినిమా మారి అనే మరో కొత్త దర్శకుడి చేతిలోకి వెళ్లిపోయింది. మరోవైపు మ్యాడ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టడం, మ్యాడ్ స్క్వేర్ పనుల్లో పడిపోవడంతో, కల్యాణ్ కూడా ఆ కథపై హక్కులు వదిలేసుకున్నాడు. అలా అనగనగా ఒక రాజు సినిమాను అన్నీ తానై ముందుకు నడిపిస్తున్నాడు నవీన్ పొలిశెట్టి.

2 Replies to “‘రాజు’ వెనక జరిగిన అసలు కథ ఇదీ”

Comments are closed.