‘కమ్మ రాజ్యం’ సమస్య అదేనా?

ఆర్జీవీ కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా సెన్సారు ముంగిట్లో ఆగిపోయింది. ప్రాంతీయ సెన్సారు బోర్డు దగ్గర చుక్కెదురయింది. ఈ సినిమాకు సెన్సారు ఇవ్వాలంటే దాదాపు 90 కట్ లు చెప్పాల్సి వస్తుందని, అందువల్ల సెన్సారు…

ఆర్జీవీ కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా సెన్సారు ముంగిట్లో ఆగిపోయింది. ప్రాంతీయ సెన్సారు బోర్డు దగ్గర చుక్కెదురయింది. ఈ సినిమాకు సెన్సారు ఇవ్వాలంటే దాదాపు 90 కట్ లు చెప్పాల్సి వస్తుందని, అందువల్ల సెన్సారు ఇవ్వలేమని, రివైజింగ్ కమిటీకి వెళ్లమని చెప్పేసారు. రివైజింగ్ కమిటీ కి అప్లయి్ చేసారు. వాళ్లు ఓకె అని చూస్తామంటే, సినిమా చూపించాలి. అప్పుడు వాళ్లేమంటారు అన్నదాన్ని బట్టి మిగిలిన సంగతి.

ఇదిలా వుంటే కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా ఇటు తెలుగుదేశానికి వ్యతిరేకంగా, అటు వైకాపాకు అనుకూలంగా వుంటుందని ఇన్నాళ్లు అనుకుంటున్న, వినిపిస్తున్న సంగతి. అలాగే టైటిల్ ను బట్టి కొద్దిగా కమ్మ సామాజిక వర్గాన్ని ఇబ్బంది పెట్టే సీన్లు వుంటాయని అనుకుంటూ వచ్చారు.

అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న సంగతి వేరుగా వుంది. సినిమాలో రాజకీయ వ్యవహారాలకు దీటుగా కులాల వ్యవహారాలు కూడా వున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఓ సామాజిక వర్గాన్ని బాగా టార్గెట్ చేసి, మరో సామాజిక వర్గాన్ని బాగా హైలైట్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమాకు సర్టిఫికెట్ రాకపోవడానికి కారణాల్లో ఇదీ ఒకటి అని తెలుస్తోంది.

అయితే ఆర్జీవీ ముందు జాగ్రత్తగా చాలా సీన్లకు రెండు వెర్షన్లు రెడీచేసి వుంచినట్లు తెలుస్తోంది. అవసరం అయితే వాటిని, వీటిని క్లబ్ చేసి రెండో వెర్షన్ తయారీకి కూడా రెడీ చేసినట్లు బోగట్టా.