Advertisement

Advertisement


Home > Movies - Movie News

నా ట్వీటు ఓ ప్రెస్ మీట్.. తిట్టేవాళ్లే కావాలి నాకు

నా ట్వీటు ఓ ప్రెస్ మీట్.. తిట్టేవాళ్లే కావాలి నాకు

బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్న తమన్ మీడియా ముందుకొచ్చాడు. తన రీసెంట్ జర్నీ గురించి, వెంకీమామ మూవీ గురించి, సోషల్ మీడియాలో ట్రోల్స్ గురించి రియాక్ట్ అయ్యాడు. మరీ ముఖ్యంగా ఈసారి మీడియాతో ఓ కొత్త విషయం షేర్ చేసుకున్నాడు తమన్. ఇకపై రీమిక్స్ చేయనని, ఎప్పుడు రీమిక్స్ చేసినా బాలు గారు ఫోన్ చేసి మరీ తిడుతున్నారని చెప్పుకొచ్చాడు.

"రీమిక్స్ చేయడం లేదు, ఇకపై కూడా చేయననే అనుకుంటున్నాను. ఆ ఒరిజినల్ సాంగ్ మ్యూజిక్ డైరక్టర్, లిరిక్ రైటర్, సింగర్ ఇలా అంతా తిట్టుకుంటారు. అవసరమా నాకు? బాలు గారు అయితే ఫోన్ చేసి మరీ తిడతారు. ఏదైనా రీమిక్స్ చేస్తే చాలు, ఆయన ఫోన్ చేసి, నీకెందుకురా ఇవన్నీ అని తిడుతుంటారు. రీమిక్స్ చాలా టెన్షన్. ఇక చేయనేమో. రీమిక్స్ సాంగ్స్ చేయనని, నా దగ్గరకొచ్చే దర్శకులకు ముందే చెప్పేస్తున్నాను."

సో.. తమన్ నుంచి ఇక రీమిక్స్ సాంగ్స్ రావన్నమా. అటు సోషల్ మీడియాలో ట్రోల్స్ పై కూడా రియాక్ట్ అయ్యాడు తమన్. తిట్టేవాళ్లే తనకు కావాలంటున్నాడు. వాళ్ల కోసం మరింత కష్టపడతానని, మంచి సాంగ్ వచ్చినప్పుడు గతంలో తిట్టిన వ్యక్తికి ట్వీట్ చేసి మరీ ఫీడ్ బ్యాక్ అడుగుతానంటున్నాడు తమన్.

"ఫీడ్ బ్యాక్ ఎప్పుడూ తీసుకుంటాను. ట్విట్టర్ లో  అన్నీ చూస్తుంటాను, రెస్పాండ్ అవుతాను. నాకు తిట్టేవాళ్లే కావాలి. అమ్మ తిట్టబట్టే కదా ఈ పొజిషన్ కు వచ్చాం. అభిమానులు బాధపడితేనే కదా ట్వీట్ చేస్తారు. అవి కచ్చితంగా ఫాలో అవుతా. వాళ్లను తృప్తిపరచడం కోసం పనిచేస్తాను. మంచి పాట వచ్చినప్పుడు లాస్ట్ టైమ్ బాధపడినవాడ్ని, ఈసారి శాటిస్ ఫై అయ్యావా అని అడుగుతాను కూడా. నా ట్వీటు ఓ ప్రెస్ మీట్."

బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చినా పారితోషికం పెంచమని ఎవ్వర్నీ అడగలేదంటున్నాడు తమన్.. మనం పనిచేస్తే ఆటోమేటిగ్గా వాళ్లే రెమ్యూనరేషన్ పెంచుతారని, ఇన్నాళ్లూ తన కెరీర్ అలానే సాగిందని చెప్పుకొచ్చాడు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?