పవన్ కల్యాణ్ యాత్రలు, సమావేశాల్లో ఆయన మాటలు, ప్రెస్ మీట్లు చూస్తుంటే.. ఆయనో రాజకీయ ఉన్మాదిలా మారిపోయారని పూర్తిగా అర్థమవుతుంది. తనకు దక్కనిదాని గురించి ఆలోచించడం, మరో ప్రయత్నంలో కచ్చితంగా దక్కించుకోవాలనుకోవడం సాధారణ వ్యక్తులు చేసే పని. పక్కనోడికి ఎందుకు దక్కిందా అని రగిలిపోవడం, ఐదేళ్లదాకా ఆ అవకాశం రాదని తెలిసినా కూడా పనిగట్టుకుని విమర్శలకు దిగడం ఉన్మాదులు చేసే పని. ప్రస్తుతం పవన్ రాజకీయ ఉన్మాదిలానే రాష్ట్ర ప్రజలకు కనిపిస్తున్నారు.
ఒక్కటి మినహా పోటీ చేసిన అన్ని స్థానాల్లో పార్టీ ఎందుకు ఓడిపోయిందనే ఆలోచన జనసేనానిలో ఎంతమాత్రం లేదు. నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో చేస్తున్న సమీక్షల్లో కనీసం ఏం జరిగింది, ఏం జరుగుతోందనే ప్రస్తావనే లేదు. కేవలం జగన్ ని టార్గెట్ చేసుకుని మాట్లాడ్డం ఒక్కటే పవన్ చేస్తున్న పని, పవన్ కి చేతనైన పని. జైలుకెళ్లొచ్చిన జగన్ ముఖ్యమంత్రి ఎందుకయ్యారు? ముఖ్యమంత్రి కొడుకు మళ్లీ ముఖ్యమంత్రి ఎందుకయ్యారు? హిందూ మతానికి చెందని జగన్ ముఖ్యమంత్రి ఎందుకయ్యారు? రెడ్డి కులానికి చెందిన జగన్ ఎందుకు ముఖ్యమంత్రి అయ్యారు? స్థూలంగా చూస్తే పవన్ విమర్శలన్నీ ఈ నాలుగు పాయింట్ల చుట్టూనే తిరుగుతున్నాయి.
ఇసుక కొరత, ఇంగ్లిష్ మీడియం, కార్యకర్తలపై దాడులు.. ఇలా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా.. చివరికి పవన్ ఆ నాలుగు అంశాల దగ్గరకే వస్తారు. వాటి దగ్గరే తన ప్రసంగం ముగిస్తారు. జగన్ రెడ్డీ, జగన్ రెడ్డీ అంటూ ఊగిపోతూ మాట్లాడ్డం చూస్తుంటే పవన్ లో రోజురోజుకీ ఈ ఉన్మాదం పాళ్లు పెచ్చుమీరుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. పవన్ ని ఎవరూ పట్టించుకోకపోవడం వల్లే ఆయన ఇలా ఉన్మాదిలా మారిపోయారని అర్థమవుతుంది.
కుటుంబ సభ్యులు కూడా ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పే పరిస్థితిలో లేరు. ఒకవేళ చెప్పినా ఆయనకు వినే ఓపిక లేనే లేదు. విన్నా అర్థం చేసుకునే జ్ఞానం అంతకంటే లేదు. పుస్తకాలు మరీ ఎక్కువగా చదవడం వల్లే పవన్ ఇలాంటి మానసిక పరిస్థితికి చేరుకున్నారనే అనుమానమూ రాకమానదు. నాకు కులమతాలు లేవని జగన్ చెప్పిన మాటల్ని కూడా వక్రీకరించేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారంటే అయన ఎంత ఉన్మాదిగా మారిపోయారో తెలుస్తుంది.
ఇకపై కూడా ఇలాగే ప్రవర్తిస్తే, ఈ రాజకీయ ఉన్మాదాన్ని తగ్గించుకోకపోతే జనమే పవన్ ను ఛీకొట్టే రోజు వస్తుంది. ఇప్పుడు అతడి కారుపైకి పూలు విసురుతున్న జనాలే, రేపు ఆయనపైకి రాళ్లు విసరడానికి ఏమాత్రం వెనకాడరనే విషయాన్ని పవన్ గుర్తించాలి.