Advertisement

Advertisement


Home > Movies - Movie News

అల వైకుంఠపురములో 'మై బాస్' ఎవరు?

అల వైకుంఠపురములో 'మై బాస్' ఎవరు?

బన్నీ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో సినిమాకు సంబంధించి ఇప్పటికే చాలా డిస్కషన్ జరుగుతోంది. గతంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ఇంటిగుట్టు సినిమాకు మోడ్రన్ వెర్షన్ గా ఈ సినిమా వస్తోందని ఇప్పటికే పెద్ద చర్చ జరుగుతోంది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా మరో సినిమా పేరు తెరపైకొచ్చింది. అదే మలయాళంలో హిట్ అయిన మై బాస్ అనే సినిమా.

మలయాళంలో దిలీప్, మమతా మోహన్ దాస్ హీరోహీరోయిన్లుగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చింది మై బాస్. ఇందులో దిలీప్ ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా, అతడి బాస్ గా మమతా మోహన్ దాస్ కనిపించనుంది. సరిగ్గా అల వైకుంఠపురములో కూడా బన్నీకి బాస్ గా పూజా హెగ్డే కనిపించనుంది. అంతేకాదు, మై బాస్ లో పెళ్లికి వీసా సమస్యలకు ముడిపెడుతూ చిన్న త్రెడ్ ఉంది.

అలాంటిదే అల వైకుంఠపురములో కూడా ఉందని చెబుతున్నారు. అలా అని మై బాస్ సినిమా స్ట్రయిట్ మూవీ కాదు, అమెరికన్ మూవీ ది ప్రపోజల్ కు దగ్గరగా ఉంటుంది. అల వైకుంఠపురం సినిమాలో అటు ఇంటిగుట్టు, ఇటు మై బాస్ సినిమాల ప్రభావం ఉంటుందని యూనిట్ కు దగ్గరి వ్యక్తులే చెబుతుండడం విశేషం.

ఇలా "స్ఫూర్తి" పొంది సినిమాలు చేయడం త్రివిక్రమ్ కు కొత్త కాదు. లార్గోవించ్ అనే సినిమా ఆధారంగా అజ్ఞాతవాసి తీశాడు. మీన అనే సినిమానే అ..ఆగా తీశాడు. అతడి గత చిత్రాల్లో ఒకటైన అతడు సినిమాలో హాలీవుడ్ మూవీ అసాసిన్స్ ఛాయలు కనిపిస్తాయి. సో.. అల వైకుంఠపురములో 'మై బాస్' ఛాయలు ఎన్ని ఉన్నాయో తెలియాలంటే మరో నెల రోజులు ఆగాల్సిందే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?