కంగనా కారవాన్.. బాలీవుడ్ లోనే కాస్ట్ లీ ఇంటీరియర్

సినిమాల్లో హీరోహీరోయిన్లకు కేరవాన్ లేదా వ్యానిటీ వ్యాన్ లు ఉంటాయి. ఈమధ్య కొంతమంది సొంతగా వాటిని ఏర్పాటు చేసుకుని, ఆ బిల్లుని నిర్మాతలకు పంపిస్తున్నారు. అయితే చాలామంది వీటిని రెంట్ కి తెప్పించుకోడానికే ఇష్టపడుతుంటారు.…

సినిమాల్లో హీరోహీరోయిన్లకు కేరవాన్ లేదా వ్యానిటీ వ్యాన్ లు ఉంటాయి. ఈమధ్య కొంతమంది సొంతగా వాటిని ఏర్పాటు చేసుకుని, ఆ బిల్లుని నిర్మాతలకు పంపిస్తున్నారు. అయితే చాలామంది వీటిని రెంట్ కి తెప్పించుకోడానికే ఇష్టపడుతుంటారు. బాలీవుడ్ నటీనటులకు ఇలా కారవాన్లు తయారు చేసి ఇచ్చే వ్యక్తి ఒకరున్నారు. ఆయన పేరు కేతన్ రావల్. చాలామంది హీరోహీరోయిన్లకు ఆయన కారవాన్లు డిజైన్ చేసి ఇచ్చాడు. వాటిలో అన్నిటికంటే కాస్ట్ లీ ఇంటీరియర్ ఉన్న కేరవాన్, కంగనా రనౌత్ దగ్గర ఉందని చెబుతున్నాడు కేతన్.

కంగనా రనౌత్ కేరవాన్ అదిరిపోయే రేంజ్ లో ఉంటుందట. కంగన ఇంట్లో ఎలాంటి డిజైన్లు ఉన్నాయో కారవాన్ లో కూడా అలాంటి సెటప్ ఉండేలా తయారు చేయించుకుందట. వ్యాన్ లోని సోఫాలు, ఛెయిర్లు అన్నీ.. ఒరిజినల్ టేక్ వుడ్ తో తయారు చేశామని చెబుతున్నారు కేతన్. ఆ ఇంటీరియర్ ఖరీదు 65 లక్షల రూపాయలు. ఇంత రేటుతో కారవాన్ లో ఇంటీరియర్ చేయించుకున్న నటుడు లేదా సెలబ్రిటీ ఇంకొకరు లేరు.

బాలీవుడ్ హీరోలే కాదు, అంబానీ ఫ్యామిలీకి కూడా వ్యానిటీ వ్యాన్లు తయారు చేయించి ఇచ్చిన కేతన్ రావల్.. వాటన్నిటిలో అత్యంత ఖరీదైన ఇంటీరియర్ మాత్రం కంగనా కారవాన్ లోనే ఉందంటున్నాడు.

షారుఖ్ ఖాన్ కారవాన్ బాగా పెద్దది. కొన్ని కొన్ని లొకేషన్లకు దాన్ని తీసుకెళ్లడం కష్టం. అందుకే ఇటీవల షారుఖ్ కోసం మరో చిన్న వ్యాన్ తయారు చేయించారట. అసలు బాలీవుడ్ లో ఈ కారవాన్లను పూనమ్ థిల్లాన్ ఇంట్రడ్యూస్ చేశారట. ఆమె తర్వాత చాలామంది వీటిని ఉపయోగించడం మొదలుపెట్టారు. శ్రీదేవి, అనిల్ కపూర్, అమితాబ్ బచ్చన్.. ఇలా సీనియర్లంతా వీటిని షూటింగ్ స్పాట్ లోకి తీసుకొచ్చేవారు.

ఈ కాలంలో స్టార్ హీరోలు, హీరోయిన్లకు ప్రత్యేక కారవాన్లు తప్పనిసరి. ఎవరి టేస్ట్ కు తగ్గట్టు వాళ్లు ఇంటీరియర్ చేయించుకుంటున్నారు. ఈ యాంగిల్ లో చూసుకుంటే బన్నీ కారవాన్ చాలా బాగుంటుంది. ఇక బాలీవుడ్ లో కంగనా కారవాన్ అదిరిపోయే రేంజ్ లో ఉంటుందట. నిజానికి కారవాన్ లో 65 లక్షల ఇంటీరియర్ అంటే చాలా పెద్ద మొత్తం. ఓ పెద్ద ఇంటికి ఆ ఖర్చుతో టోటల్ గా ఇంటీరియర్ చేయించొచ్చు.