Advertisement

Advertisement


Home > Movies - Movie News

కురు సామ్రాజ్యాలే కూలిపోయాయి...మోహన్ బాబు హాట్ కామెంట్స్ ఎవరి మీద....?

కురు సామ్రాజ్యాలే కూలిపోయాయి...మోహన్ బాబు హాట్ కామెంట్స్ ఎవరి మీద....?

విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు పుట్టిన రోజు ఈ రోజు. ఆయన 71 ఏళ్ళు పూర్తి చేసుకుని 72వ ఏట అడుగుపెట్టారు. ఒక సామాన్యుడిగా సినీ రంగంలో ఎంట్రీ ఇచ్చి కలెక్షన్ కింగ్ గా ఆయన ఎదిగారు. టాలీవుడ్ లో ఈ హీరో చేయన్ని సినిమాలు అంటే 550 పైచిలుకు నటించారు. నిర్మాతగా రాణించారు. అన్ని రకాల పాత్రలను పోషించి విలక్షణ నటుడు అనిపించుకున్నారు.

మోహన్ బాబు రాజకీయాలలో కూడా కొన్నాళ్ళ పాటు ఉన్నారు. ఆయన ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరి రాజ్యసభ మెంబర్ అయ్యారు. ఆ తరువాత చంద్రబాబు వైపు వచ్చి ఆయన సీఎం కావడానికి తన వంతుగా మద్దతు ఇచ్చారు. అయితే టీడీపీలో ఆ తరువాత కాలంలో మోహన్ బాబుకు తగిన స్థానం దక్కలేదు. ఆయన ఈ మధ్యలో బీజేపీకి కూడా ప్రచారం చేశారు. లేటెస్ట్ గా చూస్తే 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీకి ప్రచారం చేసి పెట్టారు.

జగన్ సీఎం అయ్యారు. అయితే మోహన్ బాబుకు రాజ్యసభ సీటు అయినా దక్కుతుంది అని అంతా భావించారు. వైసీపీ పవర్ లోకి వచ్చాక రెండు విడతలుగా రాజ్యసభ ఖాళీలను భర్తీ చేసి ఎనిమిది మందిని ఎంపీలుగా చేస్తే మోహన్ బాబు పేరు ఎక్కడా వినిపించలేదు. దాంతో పాటు ఆయన వైసీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు.

ఈ నేపధ్యంలో ఒక యూట్యూబ్ చానల్ మోహన్ బాబుని 72వ పుట్టిన రోజు వేళ ఇంటర్వ్యూ చేసింది ఆ ఇంటర్వ్యూలో మోహన్ బాబు చేసిన సంచలన కామెంట్స్ ఎవరి మీద అన్న చర్చ వస్తోంది. రాజకీయాల మీద తనకు ఇంటరెస్ట్ లేదని మోహన్ బాబు చెప్పారు. నీచమైనవి క్షుద్రమైనవి రాజకీయాలు అని మోహన్ బాబు అంటున్నారు. రాజకీయాలకు తాను అసలు సరిపోనని, తన లాంటి వాడు అక్కడ ఉండడమే తప్పు అన్నట్లుగా మోహన్ బాబు మాట్లాడారు.

జగన్ తన బంధువు కావడం వల్లనే తాను వైసీపీకి 2019 ఎన్నికల్లో ప్రచారం చేశానని ఆ తరువాత తాను కామ్ గానే ఉన్నాను అని చెప్పారు. తనకు పదవులు కావాలనో మరోటి ఆశించో ప్రచారం చేయలేదని అన్నారు. తనకు పదవులు కావాల్ని తన అభిమానులకు ఉండొచ్చేమో కానీ తనకు మాత్రం ఏ ఆశలు లేవన్ మోహన్ బాబు చెప్పారు. తాను నూటికి తొంబై తొమ్మిది శాతం మళ్లీ రాజకీయాల్లోకి రానని ఆయన తేల్చేశారు.

తాను ఒకరి మోచేతి నీళ్ళు తాగే రకం కాదని, అలాగే తాను పదవుల కోసం వెళ్లి వాళ్ళ ఆఫీసులో ఉదయాన్నే కూర్చోనే పరిస్థితి లేదని ఆయన చెప్పారు. అందరూ ప్రజా సేవకులే. ప్రజలకు మేలైన పాలన అందించాలని ఆయన అన్నారు. ఎవరు ముఖ్యమంత్రి అయినా ప్రజల కోసం పనిచేయని నాడు ఆయా ప్రభుత్వాలు కూలిపోతాయని మోహన్ బాబు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

మహా మహా కురు సామ్రాజ్యాలే కూలిపోయిన నేపధ్యం ఉందని, అందువల్ల ఎవరైనా ఈ సంగతి గుర్తు పెట్టుకోవాలని ఆయన స్పష్టం చేశారు. మరి ఈ మాటలు మోహన్ బాబు ఎవరిని ఉద్దేశించి అన్నారు అన్నది ఇపుడు చర్చనీయాంశంగా ఉంది. ఆయన వైసీపీ నేతలను ఉద్దేశించి అన్నారా లేక యాధాలాపంగా అన్నారా అన్నది కూడా చూడాల్సి ఉంది. ఇక బీజేపీలో తనకు ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఇష్టమని, ఆయన ప్రధాని కాక ముందు ఒక సారి, ప్రధాని అయిన తరువాత నాలుగు సార్లు తాను కలిశాను అని ఆయనను తాను ఎపుడూ అభిమానిస్తాను అని మోహన్ బాబు చెప్పడమూ విశేషం.

ఈ మధ్యనే బీజేపీకి చెందిన సోము వీర్రాజు సహా కీలక నేతలు మోహన్ బాబుని ఆయన తిరుపతి నివాసంలో కలిశారు. మరి మోహన్ బాబు బీజేపీ వైపు చూస్తారా అన్నది కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఆయన 99 పెర్సెంట్ రాజకీయాల్లోకి రాను అన్నారు ఆ ఒక్క శాతం అలా ఖాళీగా ఉంచారు. సో బీజేపీ వైపు ఆయన చూస్తారా అన్నదే టాపిక్ గా ఉంది. 

ఏది ఏమైనా టీడీపీ వైసీపీ వైఖరులతో మోహన్ బాబు విరక్తి చెందారని ఆయన తాజా మాటలను బట్టి అర్ధం అవుతోంది అంటున్నారు. ఏది ఏమైనా రాజకీయం నీచమైనది అంటూ మోహన్ బాబు చేసిన కామెంట్స్ సైతం వైరల్ అవుతున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?