ఈ రెండు సినిమాలు వేటికవే భిన్నమైనవి. ఇంకా చెప్పాలంటే నటీనటులు, ప్రొడక్షన్స్, కథా పరంగా పోలిక లేని సినిమాలివి. కానీ ఇప్పుడు కన్నప్ప-భైరవం మధ్య కంపారిజన్స్ తీయాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి కారణం మంచు మనోజ్.
“కన్నప్ప మీదకు భైరవం సినిమాను వదుల్తానని భయపడ్డాడు. మగాళ్లలా వెండితెరపై పోరాడదామని నా భైరవం సినిమాను వదుల్దామనుకున్నాను. అంతే, టెన్షన్ అయిపోయాడు. కన్నప్ప పోస్ట్ పోన్ చేసుకున్నాడు.” ఈరోజు ఉదయం స్వయంగా మంచు మనోజ్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఇది.
ఈ స్టేట్ మెంట్ ఇచ్చిన కొద్దిసేపటికే కన్నప్ప సినిమా విడుదల తేదీని ప్రకటించాడు మంచు విష్ణు. జూన్ 27న కన్నప్ప రాబోతున్నట్టు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఎనౌన్స్ మెంట్ ఇచ్చారు.
మరి ఇప్పుడు మంచు మనోజ్ పరిస్థితేంటి? మగాళ్లలా వెండితెరపై పోరాడదామన్న మంచు మనోజ్, కన్నప్పకు పోటీగా ఆ తేదీకి భైరవం సినిమాను విడుదల చేస్తాడా? అసలీ అంశం మంచు మనోజ్ చేతిలో ఉందా?
భైరవం అనేది మంచు మనోజ్ ఒక్కడికి చెందిన సినిమా కాదు. నిజానికి ఇందులో మెయిన్ లీడ్ మంచు మనోజ్ కాదు. అది బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సినిమా. మంచు మనోజ్, నారా రోహిత్ కూడా లీడ్ రోల్స్ పోషించారు. పైగా నిర్మాత కేకే రాధామోహన్ చేతిలో ఉన్న సినిమా.
మరి ఇలాంటి సినిమాను తన వ్యక్తిగత కారణాలు, వివాదాలతో మంచు మనోజ్, తనకు నచ్చిన తేదీకి విడుదల చేయగలడా? అది ఎంతమాత్రం సాధ్యం కాకపోవచ్చు. నిజంగా కన్నప్పతో పాటు భైరవం రిలీజైతే వెండితెరపై మగాళ్ల పోటీ చూడొచ్చు.
విష్ణు కి మాడామోహనరెడ్డి గాడి సపోర్ట్ ఉంది..
ni em,,, r mo gu du
Ni e m. … R mo gu l lu r a ma n di ki pu tuna la n ja
జాయిన్ అవ్వాలి అంటే