పవన్ కు కథలు చెప్పిన దర్శకులు చాలామంది ఉన్నారు. కానీ ఆయన కొందరికే అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో ఎన్నో సూపర్ హిట్స్ మిస్సయ్యారు. ఆ దర్శకులు, ఆ కథల జాబితా చెప్పుకుంటే చాంతాడంత అవుతుంది.
ఈ లిస్ట్ లో బొమ్మరిల్లు భాస్కర్ కూడా ఉన్నాడనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అవును.. బొమ్మరిల్లు భాస్కర్ కూడా పవన్ కు కథ చెప్పాడంట. ఆరెంజ్ సినిమా టైమ్ లో పవన్ కు కథ చెప్పానని, అది తన కెరీర్ బెస్ట్ సినిమా అవుతుందని అంటున్నాడు ఈ డైరక్టర్.
“నా బెస్ట్ ఫిలిం ఇంకా తీయలేదు. అది చేయాలనే ఆశ ఉంది. నా కెరీర్ లోనే బెస్ట్ సినిమా అవుతుంది. కథ మొత్తం రెడీగా ఉంది. లాంగ్ బ్యాక్ పవన్ కల్యాణ్ కు చెప్పాను. ఇలా కూడా కథలు రాస్తారా అని ఆయన అన్నారు. డిఫరెంట్ గా ఉంది, బాగుందన్నారు. కానీ ఆ కథ పూర్తి చేయాలంటే నేను ఇంకా చాలా లైఫ్ చూడాలి. ఆ అనుభవాలు కథకు పనికొస్తాయి. అందుకే అలా పక్కనపెట్టాను. ఇన్నాళ్లకు ఆ కథకు కావాల్సినంత లైఫ్ ఎక్స్ పీరియన్స్ నేను ఫేస్ చేశాను. ఇప్పుడు కథ పక్కాగా వచ్చింది.”
ప్రస్తుతం అదే కథపై చర్చలు కూడా సాగుతున్న విషయాన్ని బయటపెట్టాడు భాస్కర్. ఎన్నో ఏళ్ల కిందట పవన్ విన్న ఆ కథను, ఇప్పుడు ఏ హీరో వింటున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అది ఎవరు ఓకే చేస్తారనేది ఇంకా పెద్ద సస్పెన్స్.
జాయిన్ కావాలి అంటే
హాయ్
Raviteja tho aithe movie set avthundhi