కరణ్ జోహార్ దగ్గర..ప్రతీదీ లెక్కే

బాలీవుడ్ జనాలు డబ్బులు విచ్చలవిడిగా, లెక్కా జమా లేకుండా ఖర్చు చేస్తారనే అపోహ వుంది. కానీ కరణ్ జోహార్ లాంటి వాళ్ల వైనం తెలిస్తే, వింటే కాస్త ఆశ్చర్యంగానే వుంటుంది.  Advertisement కరణ్ జోహార్…

బాలీవుడ్ జనాలు డబ్బులు విచ్చలవిడిగా, లెక్కా జమా లేకుండా ఖర్చు చేస్తారనే అపోహ వుంది. కానీ కరణ్ జోహార్ లాంటి వాళ్ల వైనం తెలిస్తే, వింటే కాస్త ఆశ్చర్యంగానే వుంటుంది. 

కరణ్ జోహార్ సినిమాను బాగా ప్రమోట్ చేయిస్తారు. పంపిణీ చేయిస్తారు. కేర్ తీసుకుంటారు. ఇవన్నీ వాస్తవం. కానీ రిస్క్ తీసుకోరు. పంపిణీ చేయడం, ప్రమోట్ చేయడం తప్ప తన చేతికి మట్టి అంటించుకోరని టాలీవుడ్ జనాల బోగట్టా. కరణ్ జోహార్ సినిమా ప్రమోషన్ కోసం చేసే ప్రతి పనికి బిల్లింగ్ వుంటుందని విశ్వసనీయ వర్గాల బోగట్టా.

ఖర్చులు అంటే కేవలం హోటళ్లు, ఫ్లయిట్ టికెట్ లు, బౌన్సర్లు లాంటి రెగ్యులర్ మాత్రమే కాదట. ఎక్కడకు వెళ్తే అక్కడకు జనాలు రావడం, వాళ్లను పోగేయడం, ఆ జనాలకు చేసే ఖర్చులు కూడా బిల్లింగ్ లో వుంటాయని తెలుస్తోంది. బయట వాళ్లకు భయంకరంగా జనాలు వచ్చినట్లు కనిపిస్తుంది. కానీ అసలు లెక్క బిల్లింగ్ లో వుంటుందట.

కరణ్ దగ్గర లెక్క పక్కాగా వుండాల్సిందే అని టాలీవుడ్ లో వినిపిస్తోంది. ప్రతి చిన్న ఖర్చు డిటైల్డ్ గా లెక్కలోకి తీసుకుంటారట. సినిమా విడుదలయ్యాక, కలెక్షన్లు, అడ్వాన్స్ లు ఇవన్నీ లెక్కలు వేసుకున్నపుడు ఇవన్నీ బయటకు వస్తాయంట. 

ఈ విషయం తెలిసిన వారు బిల్లింగ్ చూసి ఆశ్చర్యపోరు కానీ, కొత్త వాళ్లు తొలిసారి ఈ బిల్లింగ్ చూస్తే మాత్రం అవాక్కవుతారట. అప్పటి వరకు కరణ్ భలే ప్లానింగ్ అని మురిసిపోయే వారు, ఆ బిల్లింగ్ చూసి అవాక్కవుడం పక్కా అన్నది టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా.