Advertisement

Advertisement


Home > Movies - Movie News

కరీనా కపూర్ లా అవ్వాలంటే ఇలా తినండి

కరీనా కపూర్ లా అవ్వాలంటే ఇలా తినండి

కరీనాకపూర్.. వయసు 39 సంవత్సరాలు, ఫిజిక్ చూస్తే మాత్రం పాతికేళ్ల కంటే ఇంకా తక్కువే అనిపిస్తుంది. పెళ్లయి, ఓ బిడ్డకు తల్లయినప్పటికీ కరీనా అందం తగ్గలేదు. ఆ ఫిజిక్ చెక్కుచెదరలేదు. ఆమె ఎలా తన షేప్ మెయింటైన్ చేస్తుందనేది చాలామంది అమ్మాయిలకు డౌట్. దానికి సమాధానం దొరికేసింది. కరీనా ఏం తింటుందో స్వయంగా ఆమె న్యూట్రిషనిస్ట్ రుజుతా దివాకర్ చెబుతున్నారు.

గుడ్ న్యూస్ అనే సినిమాలోని ఓ పార్టీ సాంగ్ లో కరీనా కపూర్ అదరగొట్టింది. పార్టీ వేర్ ధరించి, స్లిమ్ ఫిజిక్ తో మతిపోగొట్టింది బెబో. ఆ ఫిజిక్ కు ఆమె ఫాలో అయిన ఆహార నియమాలే కారణం అంటోంది రుజుతా. ఆ సాంగ్ షూటింగ్ కు వారం రోజుల ముందు నుంచి కరీనా తిన్న ఆహారాన్ని, ఫుడ్ ప్లానింగ్ ను బయటపెట్టింది.

ఉదయాన్నే కుంకుమ పువ్వు కలిపిన నల్లటి ఎండుద్రాక్షను తింటుంది కరీనా. ఇది బ్రేక్ ఫాస్ట్ కాదు, లేచిన వెంటనే తినేది. ఇక బ్రేక్ ఫాస్ట్ లో అందరిలానే పరాఠా-చట్నీ తింటుంది. లంచ్ కు ముందు కొన్ని సబ్జా గింటలు తిని కొబ్బరినీళ్లు తాగుతుంది. ఇక మధ్యాహ్న భోజనం కింద కేవలం పెరుగన్నం, అప్పడం మాత్రం తినేది. ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి వాల్ నట్స్, చీజ్ తింటుంది. సాయంత్రం అరటిపండుతో చేసిన మిల్క్ షేక్ తాగుతుంది. ఇక రాత్రికి డిన్నర్ లో వెజ్ పులావ్ తో పాటు కంద, పెరుగు తీసుకుంటుంది. పడుకునే ముందు పాలు లేదా బనానా మిల్క్ షేక్ తాగేది.

ఇలా రోజులో 8సార్లు ఆహారం తీసుకుంటూ, పద్ధతిగా ఎక్సర్ సైజ్ చేయడం వల్ల మంచి ఫిజిక్ సంపాదించిందట కరీనా. అంతా అనుకుంటున్నట్టు కరీనా రోజుకు 10 గంటలు జిమ్ చేయదని, కేవలం వారానికి 5 గంటలు మాత్రమే జిమ్ చేస్తూ మంచి షేప్ తెచ్చుకుందని చెప్పింది కరీనా వ్యక్తిగత ఆహార నిపుణురాలు.

నిజానికి ఇవన్నీ మనకు రోజువారీ దొరికేవే. కాకపోతే వాటిని ఎప్పుడు, ఎలా తినాలనే విషయాలపై చాలామందికి అవగాహన ఉండదు. సరైన నియమాలు పాటిస్తూ, కనీస వ్యాయామం చేస్తే ఎవరైనా కరీనాలా తయారు అవ్వొచ్చంటోంది రుజుతా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?