Advertisement

Advertisement


Home > Movies - Movie News

వేరే వాళ్ల సెక్స్ లైఫ్ గురించి మాట్లాడితే మీ అమ్మ‌కు ఓకేనా?

వేరే వాళ్ల సెక్స్ లైఫ్ గురించి మాట్లాడితే మీ అమ్మ‌కు ఓకేనా?

కాఫీ విత్ క‌ర‌ణ్ అంటూ.. బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జొహార్ చేసే ఇంట‌ర్వ్యూల్లో అస‌లు సంగ‌తుల క‌న్నా కొస‌రు సంగ‌తులే హైలెట్ అవుతూ ఉంటాయి. ఈ షో లో పాల్గొనే సెల‌బ్రిటీలు ప‌క్క‌గా త‌మ సినిమా ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్ త‌ర‌హాలోనే అటెండ్ అవుతారు. 

ఏ సినిమా విడుద‌ల‌కు సిద్ధం అవుతూ ఉంటే ఆ సినిమా స్టార్లు ఇందులో క‌నిపిస్తారు. వాళ్లూ ఎలాగూ త‌మ అవ‌స‌రం మేర‌కే వ‌స్తారు, వ‌చ్చిన వాళ్ల‌ను క‌ర‌ణ్ కూడా సెక్స్ గురించి, ఎఫైర్ల గురించి, ఫేవ‌రెట్ సెక్స్ పొజిష‌న్ల గురించి అడుగుతూ ఉంటాడు. ఇదంతా రొటీనే.

ఇది వ‌ర‌కూ ఈ త‌ర‌హా ప్ర‌శ్న‌ల‌తో బోలెడంత‌మంది సెక్స్ లైఫ్ గురించి చ‌ర్చ‌కు పెట్టాడు క‌ర‌ణ్. ఈ క్ర‌మంలో క‌రీనా క‌పూర్ - ఆమిర్ ఖాన్ లు పాల్గొన్న ఎపిసోడ్లో కూడా ఇదే త‌తంగం. అందుకు సంబంధించి ట్రైల‌ర్ ను క‌ట్ చేయ‌డంలోనే సెక్స్ మ్యాట‌ర్స్ ను హైలెట్ చేశారు.

పెళ్లై పిల్ల‌లున్న క‌రీనాను ఉద్ధేశించి.. పిల్ల‌లు పుట్టిన త‌ర్వాత క్వాలిటీ సెక్స్ ఉంటుందా? అంటూ క‌ర‌ణ్ త‌న సెక్సీ సందేహాన్ని వ్య‌క్తం చేశాడు. నీకు తెలీదా? అంటూ క‌ర‌ణ్ ను క‌రీనా ఎదురు ప్ర‌శ్నించ‌గా, త‌న  షో ను త‌న త‌ల్లి చూస్తుంద‌ని.. కాబ‌ట్టి త‌న సెక్స్ లైఫ్ గురించి మాట్లాడ‌లేనంటూ క‌ర‌ణ్ త‌ప్పించుకోబోగా.. అంటే, వేరే వాళ్ల సెక్స్ లైఫ్ గురించి మాట్లాడ‌టాన్ని మీ త‌ల్లి హ‌ర్షిస్తుందా? అంటూ క‌ర‌ణ్ కు సూటిగా సుత్తి లేకుండా చుర‌క‌లంటించింది క‌రీనా క‌పూర్.

ఇలాంటి స‌మాధానాలు ఎద‌ర‌యినప్పుడు... క‌ర‌ణ్ త‌న రొటీన్ ఎక్స్ ప్రెష‌న్లు ఇస్తాడు. ఎదురుదెబ్బ‌లు ప‌డిన‌ప్పుడు న‌వ్వుతూ, అవేవీ త‌న‌కు త‌గ‌ల‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తాడు. ఇక ఈ ప్రొగ్రామ్ ప్ర‌మోష‌న్స్ కు కూడా ఈ సెక్సీ ప్ర‌శ్న‌లు, తార‌ల ఎఫైర్లు, వారి గ‌త సెక్స్ అనుభ‌వాలు, వారి విడాకుల వ్య‌వ‌హారాలు.. ఇవే అస్త్రాలు! ఈ ప‌రంప‌ర‌లోనే ఇది మ‌రోటంతే.

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా