కర్త..కర్మ..క్రియ..త్రివిక్రమ్

అంతా మీరే చేసారు అనే బొమ్మరిల్లు డైలాగు చాలా పాపులర్. భీమ్లా నాయక్ సినిమా వాయిదా అంతా దర్శకుడు త్రివిక్రమ్ నే చేసారు. లేదూ అంటే అది జరిగి వుండేది కాదు.  Advertisement ఇదీ…

అంతా మీరే చేసారు అనే బొమ్మరిల్లు డైలాగు చాలా పాపులర్. భీమ్లా నాయక్ సినిమా వాయిదా అంతా దర్శకుడు త్రివిక్రమ్ నే చేసారు. లేదూ అంటే అది జరిగి వుండేది కాదు. 

ఇదీ టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా. భీమ్లా నాయక్ వాయిదా అన్నది ఇప్పటికిప్పుడు జరిగింది కాదు. దాదాపు నెల రోజుల క్రిందటి నుంచే ప్రారంభమైన వ్యవహారం. రాజమౌళి, దానయ్య నేరుగా దర్శకుడు త్రివిక్రమ్ ను అప్రోచ్ అయిన దగ్గరే ప్రారంభమైంది

అయితే పవన్ కళ్యాణ్ చాలా పట్టుదలగా వున్నారు. ఎలాగైనా సంక్రాంతి బరిలోకి దిగాలని. నిర్మాతలు అటైనా, ఇటైనా సరే అన్నట్లు వున్నారు. ఇలాంటి నేపథ్యంలో పవన్ అపాయింట్ మెంట్ ఎవరు అడిగినా కుదరలేదు. ఇక త్రివిక్రమ్ మాత్రమే కీలకం అయ్యారు. రాజమౌళి నిత్యం త్రివిక్రమ్ తో టచ్ లో వుండడం ప్రారంభమైంది. 

పవన్ కళ్యాణ్ విదేశానికి వెళ్లిపోతే మళ్లీ వాయిదా సాధ్యం కాదు. అందుకే నిన్నటికి నిన్న అందరూ కలిసి భారాన్ని త్రివిక్రమ్ మీద వేసారు. ఆయన తన ప్రయత్నం తాను చేసాను. ఆయన మాటను పవన్ జవదాటరు. దాంతో పని సులువు అయిపోయింది.

మిగిలిపోయినవి అన్నీ నిర్మాత నాగవంశీ ..జనవరి 12 అంటూ వరుసగా వేసుకువచ్చిన ట్వీట్ లు మాత్రమే.