విశాఖలో వీర లెవెల్లో సందడి చేసిన బైరెడ్డి

ఆయన రాయల‌సీమ జిల్లాలకు చెందిన యువ నేత. నోరు విప్పితే మాటలు అలా ధారాప్రవాహంగా సాగిపోతాయి. ఆయనకు ఏపీలో ఉన్న యూత్ ఫాలోయింగ్ చాలా గొప్పది. పైగా ఆయన మంచి క్రీడాకారుడు. అందుకే ఆయనను…

ఆయన రాయల‌సీమ జిల్లాలకు చెందిన యువ నేత. నోరు విప్పితే మాటలు అలా ధారాప్రవాహంగా సాగిపోతాయి. ఆయనకు ఏపీలో ఉన్న యూత్ ఫాలోయింగ్ చాలా గొప్పది. పైగా ఆయన మంచి క్రీడాకారుడు. అందుకే ఆయనను మెచ్చి మరీ జగన్ శాప్ చైర్మన్ ని చేశారు. ఇదిలా ఉంటే విశాఖకు తాజాగా వచ్చిన బైరెడ్డి స్థానిక క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం యూత్ ని కట్టిపడేసింది.

టాప్ సెలిబ్రిటీ మాట్లాడితే వచ్చే చప్పట్లు, ఈలలు, గోలలు అన్నీ కూడా బైరెడ్డి ప్రసంగంలో అడుగడుగునా కనిపించాయి, వినిపించాయి. ఇక జగన్ తో పాదయాత్ర వేళ ఎపుడో విశాఖ వచ్చానని, ఇన్నాళ్ళకు బ్యూటీ ఫుల్ సిటీకి రావడం తనకు చాలా ఆనందకరమని  బైరెడ్డి చెప్పారు.

విశాఖను మించిన సుందర నగరం లేదని, ఇక్కడ లేనిది లేదని కూడా బాగా కితాబులు ఇచ్చేశారు. ఈ సందర్భంగా రాజకీయాల మీద ఆయన చేసిన కామెంట్స్ వేడి పుట్టించాయనే చెప్పాలి. జగన్ అయిదు కోట్ల ప్రజలను ఈ రోజుకీ నమ్ముకున్నారు తప్ప ఆయన ఏ నాయకుడినీ కాదని బైరెడ్డి అనడం విశేషం.

జనాలు కూడా జగన్ని దీవిస్తున్నారని, ఆయనే మళ్లీ మళ్లీ సీఎం గా ఉండాలని కోరుకుంటున్నారని బైరెడ్డి చెప్పుకొచ్చారు. అనుకూల మీడియాను అడ్డం పెట్టుకుని తెల్లారి లేస్తే జగన్ మీద విమర్శలు చేయడం చంద్రబాబుకు అలవాటు అయిపోయింది అని బైరెడ్డి విమర్శించారు.

అయితే ఇది సోషల్ మీడియా, ఇన్స్టాగ్రాం యుగమని, మనం చెప్పిందే జనాలు వింటారు అనుకుంటే పొరపాటని తెలుసుకోవాలని బాబుకు చురకలు అంటించారు. జనాలకు ఎవరు మంచి చేస్తున్నారో తెలుసని, కానీ విపక్షాలు మాత్రం రాజకీయాలు చేస్తూ జగన్ని సీఎం గా ఉండకూడదని కోరుకోవడమే బాధాకరమని బైరెడ్డి అన్నారు.

ఇక చంద్రబాబు, లోకేష్ బాబుల కామెంట్స్ ని జోక్స్ గా జనాలు తీసుకుంటున్నారని, వాటికి సోషల్ మీడియాలో చదువుకుంటూ రిలాక్స్ అవుతున్నారని బైరెడ్డి పంచులే పేల్చారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే విశాఖ రుషికొండ వద్ద బీచ్ లో స్కూబా డైవ్‌ ముప్పయి అడుగుల లోతున చేసి అక్కడ నుంచే సీఎం జగన్ కి బర్త్ డే విషెస్ చెప్పడం మాత్రం టోటల్ టూర్ లోనే హైలెట్ అనే చెప్పాలి. మొత్తానికి ఈ యువ నేత విశాఖలో రెండు రోజుల పాటు కలియదిరిగి తెగ సందడి చేసేశారు.