జపాన్ సినిమాలో ఆ 20 నిమిషాలు..!

జపాన్ సినిమా ట్రయిలర్ చాలా కొత్తగా ఉంది. సినిమా అంతకంటే కొత్తగా ఉంటుందంటున్నాడు హీరో కార్తి. సినిమా చూసిన తర్వాత తన 25వ ప్రాజెక్టుగా ఈ కథనే ఎందుకు ఎంచుకున్నానో అందరికీ అర్థమౌతుందని ఊరిస్తున్నాడు.…

జపాన్ సినిమా ట్రయిలర్ చాలా కొత్తగా ఉంది. సినిమా అంతకంటే కొత్తగా ఉంటుందంటున్నాడు హీరో కార్తి. సినిమా చూసిన తర్వాత తన 25వ ప్రాజెక్టుగా ఈ కథనే ఎందుకు ఎంచుకున్నానో అందరికీ అర్థమౌతుందని ఊరిస్తున్నాడు. చివరి 20 సినిమాలు సినిమాకు ప్రాణం అంటున్నాడు.

“ఇప్పటివరకు ఈ సినిమా చూసినవాళ్లంతా చివరి 20 నిమిషాల గురించి మాట్లాడుతున్నారు. కచ్చితంగా ప్రేక్షకులకు కూడా అది గొప్ప అనుభూతిని ఇస్తుంది. కొత్తగా అనిపిస్తుంది. ఖైదీ సినిమా చేసినప్పుడు ఆ క్యారెక్టర్ ను ఎలా ఒప్పుకున్నారని అంతా నన్ను అడిగారు. జపాన్ సినిమా చూసిన తర్వాత మరోసారి అంతా అదే ప్రశ్న అడుగుతారు. అంత కొత్తగా ఉంటుంది.”

జపాన్ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను హైదరాబాద్ లో నిర్వహించాడు కార్తి. దీనికి నాని చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ ఈవెంట్ లో మాట్లాడిన కార్తి, జపాన్ సినిమాలో తన పాత్ర గురించి, సినిమా గురించి చెప్పుకొచ్చాడు.

“జపాన్ అనేవాడు ఓ స్వార్థపరుడు, పెద్ద గజదొంగ.. సమాజానికి చాలా ప్రశ్నలు వేస్తాడు. ఇందులో కేవలం వినోదం మాత్రమే కాదు, ఆలోచింపజేసే అంశాలు చాలా ఉన్నాయి.”

జపాన్ సినిమాలో కాస్త కొత్తగా మాట్లాడతాడు కార్తి. ఆ నిర్ణయాన్ని అప్పటికప్పుడు తీసుకున్నారట. సినిమాలో క్యారెక్టర్ కొత్తగా ఉన్నప్పటికీ, తను మాట్లాడుతుంటే, మళ్లీ కార్తి అనే హీరో గుర్తొస్తున్నాడని, అఁదుకే పాత్రకు తగ్గట్టు టోన్ కూడా మార్చేశానని వెల్లడించాడు.