కార్తికేయ 2 మీద వత్తిడి మొదలు?

టాలీవుడ్ లో ఐక్యత, గిల్డ్, ఇలా ఎన్ని కబుర్లు చెప్పినా తెర వెనుక రాజకీయాలు మామూలే. అందులోనూ దిల్ రాజు నిర్మాతగా లేదా పంపిణీదారుగా సినిమా వస్తోంది అంటే దానికి పోటీగా వేరేవాళ్ల సినిమా…

టాలీవుడ్ లో ఐక్యత, గిల్డ్, ఇలా ఎన్ని కబుర్లు చెప్పినా తెర వెనుక రాజకీయాలు మామూలే. అందులోనూ దిల్ రాజు నిర్మాతగా లేదా పంపిణీదారుగా సినిమా వస్తోంది అంటే దానికి పోటీగా వేరేవాళ్ల సినిమా రాకూడదు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, నైజాంలో థియేటర్లు ఇవ్వకూడదు. 

ఎంత ఖండించినా తెరవెనుక వాస్తవం ఇదే. ఈ నెల 22న థాంక్యూ కు పోటీగా కార్తికేయ 2 రావాల్సి వుంది. కానీ నిర్మాతలకు 5న డేట్ అరేంజ్ చేస్తానని మాట ఇచ్చి పక్కకు తప్పించారని వార్తలు వచ్చాయి. కానీ 5న డేట్ ఇవ్వలేకపోయారు.

ఇప్పుడు కార్తికేయ 2 మరో డేట్ చూసుకుని ఆగస్టు 12 కు ఫిక్స్ అయింది. దాంతో మళ్లీ థియేటర్ల రాజకీయం మొదలయింది. ఆ రోజు నైజాంలో దిల్ రాజు పంపిణీ చేస్తున్న నితిన్ సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’ విడుదల వుంది. కానీ కార్తికేయ 2 మాత్రం దిల్ రాజు పంపిణీ కాదు. దాంతో దానికి థియేటర్ల దగ్గర రాజకీయం అప్పుడే ఇప్పటి నుంచీ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.

అలా అని థియేటర్లు లేవు అని కాదు. ప్రతి సినిమా కొన్ని ప్రయిమ్ థియేటర్లలో విడుదల కావాలని అనుకుంటుంది. అక్కడ మోకాలు అడ్డుతారన్నమాట. అసలే 5న బింబిసార వుంది. అది దిల్ రాజు పంపిణీనే. 12న మాచర్ల కూడా ఆయనదే. 

అందువల్ల కార్తికేయ 2కు కనుక ఇప్పటి నుంచి థియేటర్లు బ్లాక్ చేస్తే 5న వేసే బింబిసార వన్ వీక్ తీయాల్సి వుంటుంది. 12న మాచర్లకు థియేటర్లు దొరకవు. అందుకే రాజకీయం మొదలైపోయిందని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా.