Advertisement

Advertisement


Home > Movies - Movie News

కార్తికేయ ‘బెదురులంక’

కార్తికేయ ‘బెదురులంక’

ఆర్ ఎక్స్ 100 తరువాత సినిమాలు చేస్తూ వస్తున్నా సరైన హిట్ కోసం చూస్తున్నాడు హీరో కార్తికేయ. మంచి పాత్రలు వస్తున్నాయి కానీ మంచి హిట్ లు రావడం లేదు. ఇప్పుడు అతగాడు చేస్తున్న లేటెస్ట్ సినిమా ‘బెదరులంక 2012’. డిఫరెంట్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ డిజె టిల్లు ఫేమ్ నేహాశెట్టి. గతంలో కలర్ ఫోటో నిర్మించిన నిర్మాత రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను విడుదల చేసారు.

ఈ సందర్భంగా చిత్రనిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ "మా హీరో కార్తికేయకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన బ‌ర్త్‌డేకు టైటిల్ వెల్లడించడం సంతోషంగా ఉంది. త్వరలో ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. కామెడీ డ్రామాగా, గోదావరి నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఇటీవల మూడో షెడ్యూల్ ముగిసింది. యానాం, కాకినాడ, గోదావరి పరిసర ప్రాంతాల్లో అందమైన లొకేషన్లలో చిత్రీకరణ చేశాం. ఆఖరి షెడ్యూల్ త్వరలో ఉంటుంది. దాంతో సినిమా మొత్తం పూర్తవుతుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఐదు అద్భుతమైన బాణీలను అందించారు. దివంగత కవి సిరివెన్నెల గారు మా చిత్రంలో ఒక పాట రాశారు" అన్నారు.

దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ "డ్రామెడీ (డ్రామా ప్లస్ కామెడీ) జానర్ చిత్రమిది. ఈ సినిమాలో కొత్త కార్తికేయ కనిపిస్తారు. ఒక ఊరు నేపథ్యంలో వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథతో సినిమా రూపొందిస్తున్నాం. ఇందులో స్ట్రాంగ్ కంటెంట్ ఉంది. అలాగే, కడుపుబ్బా నవ్వించే వినోదం ఉంది. మనసుకు నచ్చినట్టు జీవించే పాత్రలో హీరో కార్తికేయ కనిపిస్తారు. సొసైటీకి నచ్చినట్లు బతకడం రైటా? మనసుకు నచ్చినట్టు బతకడం రైటా? అనేది సినిమాలో చూడాలి" అని చెప్పారు.  

ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, 'ఆటో' రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని ప్రధాన తారాగణం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?