థియేటర్లలో హిట్.. టీవీల్లో అట్టర్ ఫ్లాప్

బుల్లితెర వీక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది. థియేటర్లలో హిట్టయిన సినిమాకు టీవీల్లో రేటింగ్ వస్తుందని అనుకోవడానికి వీల్లేకుండా పోయింది. ఇప్పటికే ఎన్నో సినిమాలతో ఇది రుజువైంది. తాజాగా సర్దార్ మూవీతో ఈ విషయం మరోసారి…

బుల్లితెర వీక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది. థియేటర్లలో హిట్టయిన సినిమాకు టీవీల్లో రేటింగ్ వస్తుందని అనుకోవడానికి వీల్లేకుండా పోయింది. ఇప్పటికే ఎన్నో సినిమాలతో ఇది రుజువైంది. తాజాగా సర్దార్ మూవీతో ఈ విషయం మరోసారి ప్రూవ్ అయింది.

కార్తి హీరోగా నటించిన సినిమా సర్దార్. థియేటర్లలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మల్టీప్లెక్స్, బి-సెంటర్లలో సినిమా హిట్టయింది. కానీ బుల్లితెరపై మాత్రం ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది.

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారమైన ఈ సినిమాకు కేవలం 1.48 టీఆర్పీ వచ్చింది. ఈ సినిమా కంటే, రెగ్యులర్ గా ప్రసారమయ్యే బాహుబలి, మహర్షి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సినిమాలకు మంచి రేటింగ్ వచ్చింది.

అయితే ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది. ఇంత పెద్ద సినిమాను మెయిన్ ఛానెల్ లో ప్రసారం చేయలేదు జీ గ్రూప్. ఈ హిట్ సినిమాతో అది ప్రయోగం చేయాలనుకుంది. అందుకే మూవీస్ ఛానెల్ లో ప్రసారం చేసింది. దీంతో రేటింగ్ అమాంతం పడిపోయింది. మెయిన్ ఛానెల్ లో పడుంటే కనీసం సర్దార్ పరువు దక్కేది. 

ఈ సినిమాలో తండ్రికొడుకుగా కనిపించాడు కార్తి. ఓ గూఢచారి జీవితం ఎలా ఉంటుందనేది ఇందులో ఆసక్తికరంగా చూపించారు. మిత్రన్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది.