ఎక్స్ క్లూజివ్.. బెట్టింగ్ కాస్తున్న కార్తికేయ

రీసెంట్ గా కొత్త సినిమా ప్రకటించాడు కార్తికేయ. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కార్తికేయ పోషిస్తున్న పాత్ర వివరాల్ని ఎక్స్ క్లూజివ్ గా అందిస్తోంది గ్రేట్ ఆంధ్ర.…

రీసెంట్ గా కొత్త సినిమా ప్రకటించాడు కార్తికేయ. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కార్తికేయ పోషిస్తున్న పాత్ర వివరాల్ని ఎక్స్ క్లూజివ్ గా అందిస్తోంది గ్రేట్ ఆంధ్ర. తాజా సమాచారం ప్రకారం, ఇందులో కార్తికేయ బెట్టింగ్స్ కాసే కుర్రాడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటివరకు కెరీర్ లో కార్తికేయ చేయని రోల్ ఇది.

ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ సినిమా. దీనికి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ప్రస్తుతానికి జాగ్వార్ అనే వర్కింగ్ టైటిల్ అనుకుంటున్నారట. అయితే ఆల్రెడీ ఈ టైటిల్ తో ఓ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

కార్తికేయ బెట్టర్ అయినప్పటికీ, ఇది ఆ ఛాయల్లో నడిచే సినిమా కాదంట. కాస్త పొలిటికల్ టచ్ తో సాగే ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. ఇందులో కార్తికేయకు తండ్రి పాత్రలో తణికెళ్ల భరణి నటిస్తున్నారు. ఐశ్వర్య మీనన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, యూవీ క్రియేషన్స్ నిర్మాతలు ఈ సినిమాకు కూడా సంగీత దర్శకుడ్ని ప్రకటించలేదు.

రిజల్ట్ తో సంబంధం లేకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు కార్తికేయ. చావుకబురు చల్లగా, గుణ, 90ఎంఎల్, రాజావిక్రమార్క సినిమాల్లో అతడు చేసిన పాత్రలన్నీ వేటికవే భిన్నమైనవి. మధ్యలో వలిమై లో బైక్ రేసర్ గా విలన్ పాత్ర కూడా చేశాడు. ఇప్పుడీ కొత్త సినిమాలో ఇప్పటివరకు చేయని విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు కార్తికేయ.