సిని జ‌నాల‌ విష‌యంలో ఆయన్ని కేసీఆర్ ఫాలో అవుతారా?

సినిమా రంగం విష‌యంలో ఆంధ్ర సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ ఫాలో అవ్వ‌నున్నారా?.. అంటే స‌మాధానం ఔన‌నే వ‌స్తోంది. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఆంధ్ర వారిని త‌రిమి కొడతాం అన్న…

సినిమా రంగం విష‌యంలో ఆంధ్ర సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ ఫాలో అవ్వ‌నున్నారా?.. అంటే స‌మాధానం ఔన‌నే వ‌స్తోంది. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఆంధ్ర వారిని త‌రిమి కొడతాం అన్న కేసీఆర్ తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత వారికి కాల్లో ముల్లు గుచ్చుకుంటే నా పంటితో తీస్తాన‌న్నారు. ఆంద్ర జ‌నాలు వారు కూడా కేసీఆర్ వైపు మెగ్గు చూపారు. అలాగే ముఖ్యంగా సిని ఇండ్ర‌స్టీ మొత్తం తెరాస వైపు వెళ్లింది. కేటీఆర్ ఒక ట్వీట్ వేయ‌డం అల‌స్యం సిని జ‌నాలు లైక్ లు, రి ట్వీట్ చేయ‌డం చూశాము. కానీ ఇప్పుడు ప‌రిస్ధితి మారుతున్న‌ట్లు క‌న‌ప‌డుతుంది.

ఆంధ్రలో సినిమా టికెట్ల విష‌యంలోను, థియోట‌ర్స్ విష‌యంలోను ఆంధ్ర సీఎం కాస్తా మొద‌ట్లో క‌ఠినంగానే త‌ర్వాత చూసిచూడ‌నట్లు వ‌దిలేశారు. కానీ సిని జ‌నాల‌కు జ‌గ‌న్ ఏంటో బాగా ఆర్ధం అయ్యింది. కానీ ఒక వైపు తెలంగాణ సీఎం సినిమా జ‌నాల‌కు అడిగిందే అల‌స్యం వారు అడిగిన దానికి అన్నిటికి 'య‌స్' చెప్పారు. కానీ ఇప్పుడు ప‌రిస్ధితులు మారాయి.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎన్టీఆర్ తో మీటింగ్ త‌ర్వాత తెరాస‌లో సిని జనాల‌పై కొపంతో ఉన్న‌ట్లు క‌న‌ప‌డుతొంది. అందుకే ఎక్క‌డో ప్రైవేట్ స్ధ‌లంలో జ‌ర‌గ‌బోయో సిని పంక్ష‌న్ కు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేందంటే కేసీఆర్ స‌ర్కాస్ ఇంకా నుండి సిని జనాల‌కు ఎటువంటి చుక్క‌లు చూపిస్తున్నా అనేది అంచనా వేయ‌చ్చు. ఆంధ్ర‌లో ప‌ర్మిష‌న్ ఇవ్వ‌క‌పోతే సిని జ‌నాల‌తో పాటు ప్ర‌తిప‌క్ష పార్టీలు కూడా హ‌డ‌వుడి చేస్తాయి కాని తెలంగాణ‌లో ఏ రాజ‌కీయ పార్టీ కూడా సిని జ‌నాల‌కు స‌పోర్టు చేయవు. టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు అయితే తెలంగాణ‌లో ఏమి జ‌రిగిన సైలెంట్ గా ఉంటారు ఎందుకంటే బాబు ఒక మాట మాట్ల‌డితే కేసీఆర్ వంద అంటార‌ని బాగా తెలుసు.

సిని జనాలు కూడా ఎవ‌రిది అధికారంలో ఉంటే వారి వైపు వెళ్ల‌డం అల‌వాటు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఫ‌ల‌నా పార్టీ వైపు ప్ర‌జ‌లు మెగ్గు చూప్పుతున్నారంటే చాలు వారి వైపు చూస్తారు. తెలంగాణలో ఇప్పుడు రాజ‌కీయం మారుతున్న‌ట్లే సిని జ‌నాలు కూడా కాస్త సైలెండ్ గా ఉన్న‌ట్లు క‌న‌ప‌డుతున్నారు. దానికి కార‌ణం కేంద్ర బీజేపీ నాయ‌క‌త్వం తెలంగాణపై పెట్టిన ఫోక‌స్ కార‌ణం అవ్వ‌చు.

ముందు ముందు థియెట‌ర్స్ ద‌గ్గ‌ర మొద‌లు కొని ఎక్క‌డ ప‌బ్లిక్ సిని పంక్ష‌న్ కు ప్ర‌భుత్వం వైపు నుండి కాస్తా క‌ఠినంగానే పరిష్మ‌న్ ఉండ‌బోతున్న‌ట్లు క‌న‌ప‌డుతోంది. సినిమాలు వాడుకోని రాజ‌కీయం చేసే సిని ప్ర‌ముఖుల వ‌ల్ల సినిమా మీదే అదార‌ప‌డే సినిమా జ‌నాలు మాత్రం ఇప్ప‌టి నుండే వేసే ప్ర‌తి అడుగు, మాట్లాడే మాటలు కూడా కాస్తా జాగ్ర‌త‌గా మాట్లాడాలి ఎందుకంటే ఎవ‌రిని పొగిడిన ప‌క్క వారి నోప్పి రావ‌చ్చు.