ఉన్నట్లుండి సోషల్ మీడియాలో ఒక వార్త. ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో తయారయ్యే సినిమాను హీరోయిన్ కీర్తి సురేష్ రిజెక్ట్ చేసిందన్నది ఆ వార్త సారాంశం.
ఇది చాలు కదా యాంటీ ఫ్యాన్స్ కు. ట్విట్టర్ లో, ఇతర సోషల్ మీడియా ల్లో ఎన్టీఆర్ ను మోసేయడానికి. కానీ ఒక్క క్షణం ఆలోచిస్తే అసలు కీర్తి సురేష్ కు రిజెక్ట్ చేసేంత వుందా? అన్న పాయింట్ తడుతుంది.
కీర్తి సురేష్ కు ఫ్లాపులు ఎక్కువ..సినిమాలు తక్కువ. ఇప్పటికిి అయితే చేతిలో సరైన క్రేజీ ప్రాజెక్ట్ లేదు. అలాంటి టైమ్ లో ఎన్టీఆర్ – కొరటాల శివ లాంటి క్రేజీ కాంబినేషన్ ను రిజెక్ట్ చేస్తుందా? పైగా ఆ సినిమా కోసం పెద్ద పెద్ద పేర్లు వినిపిస్తున్నాయి. అలాంటి టైమ్ లో కీర్తి చాయిస్ అని, పైగా రిజెక్టు అని వినిపించడం అంటే పెద్ద జోక్ కాక ఏమవుతుంది?
అదీ కాక ఈ ప్రాజెక్టును పట్టుకోవాలని తెలుగులో బాగా పాపులారిటీ సంపాదించిన ఒక పొడుగు కాళ్ల హీరోయిన్ కూడా తెగ ప్రయత్నిస్తోందని గ్యాసిప్ లు వున్నాయి. ప్రాజెక్ట్ క్రేజ్ అలా వుంటే అందులో హీరోయిన్ చాన్స్ వస్తే కీర్తి వదులుకుంటుందా…పరుగెత్తుకుని వెళ్లి పట్టుకోదూ?