సూపర్ హిట్ సినిమాకు రీమేక్ గా వచ్చింది బేబీ జాన్. కీర్తిసురేష్ కు ఇదే తొలి హిందీ సినిమా. దీనిపై ఆమె చాలా ఆశలు పెట్టుకుంది. ఎలాగైనా బాలీవుడ్ లో క్లిక్ అయ్యేందుకు తన సర్వశక్తులు ధారపోసింది. ఈ సినిమా ప్రచారం కోసం, తన జీవితంలో అత్యంత ముఖ్యమైన పెళ్లి వేడుకను కూడా ఆమె సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయిందంటారు ఆమె సన్నిహితులు. కేవలం ఈ సినిమా కోసమే, పెళ్లయిన కొన్ని రోజులకే తిరిగి ప్రచారంలోకి వచ్చేసింది. మరోవైపు బాలీవుడ్ మీడియా నుంచి వచ్చిన విమర్శల్ని కూడా భరించింది.
ఇన్ని చేసినప్పటికీ కీర్తిసురేష్ అనుకున్నది నెరవేరలేదు. బేబీ జాన్ సినిమా ఫ్లాప్ అయింది. సినిమా అస్సలు బాగాలేదని రివ్యూస్ చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా సినిమాలో కీర్తిసురేష్ పాత్ర క్లిక్ అవ్వలేదని, డెబ్యూ మూవీకి ఇలాంటి క్యారెక్టర్ సెలక్ట్ చేసుకోవడం ఆమె చేసిన తప్పని అంటున్నారు సమీక్షకులు.
తమిళ్ లో హిట్టయిన తేరి సినిమాకు రీమేక్ గా వచ్చింది బేబీ జాన్. తమిళ్ లో సమంత నటించిన పాత్రను హిందీలో కీర్తి సురేష్ పోషించింది. కథలో ఈ పాత్ర చనిపోతుంది. అలాంటి పాత్రను తన డెబ్యూ మూవీ కోసం కీర్తి సురేష్ సెలక్ట్ చేసుకుంది. ఈ క్యారెక్టర్ తో బాలీవుడ్ జనాలు ఆశించిన కమర్షియల్ డోస్ ను, కీర్తిసురేష్ అందించలేకపోయింది.
దీనికితోడు పుష్ప-2 హవా కూడా కీర్తి సురేష్ కలల్ని చెల్లాచెదురు చేసింది. పుష్ప-2 సినిమా నార్త్ జనాల నరనరాల్లోకి ఎక్కేసింది. ఈ సినిమాను ఉత్తరాదిన రిపీటెడ్ గా చూస్తున్నారు జనం. ఈ వేడిలో మరో సినిమా వచ్చినా ఆదరించే పరిస్థితి లేదు. ఆ ప్రభావం బేబీ జాన్ పై, అట్నుంచి అటు కీర్తి సురేష్ పై గట్టిగా పడింది.
బేబీ జాన్ ఫ్లాప్ అవ్వడంతో కీర్తి సురేష్ బాలీవుడ్ కెరీర్ డైలమాలో పడింది. అయితే ఆమె ఇప్పటికే మరో హిందీ సినిమాకు కమిటైందనే ప్రచారం జరుగుతోంది.
You raise pushpa mania in this topic dis-hearted some GA followers…🤣🤣
allu arjun bhajana
విజయ్ గారి మానియాతో బ్లాక్ బస్టర్ అయ్యిన సినెమా
Keerthi Suresh nijam gaa heroine material?