మెడలో మంగళ సూత్రంతో కీర్తిసురేష్

రెడ్ కలర్ మోడ్రన్ డ్రెస్ వేసుకున్న కీర్తిసురేష్, మెడలో పసుపు తాడుతోనే ప్రచారానికి హాజరైంది.

పెళ్లి తర్వాత ఓ వారం రోజులు గ్యాప్ తీసుకుంటారు హీరోయిన్లు. తిరిగి కెమెరా ముందుకొచ్చినప్పుడు పెళ్లయిన ఛాయలేవీ కనిపించకుండా జాగ్రత్తపడతారు. మెడలో తాళి కూడా తీసేస్తారు. మెహందీ కూడా చెరిగిపోతుంది.

కానీ కీర్తిసురేష్ మాత్రం పెళ్లయిన 2 రోజులకే బయటకొచ్చింది. దానికి కారణం బేబీ జాన్ మూవీ. ఈ సినిమా రిలీజ్ దగ్గరపడింది. ప్రమోషన్ కు గ్యాప్ ఇచ్చేంత టైమ్ లేదు. పైగా కీర్తిసురేష్ కు తొలి హిందీ సినిమా ఇది.

అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా పెళ్లి మూడ్ నుంచి బయటకొచ్చేసింది. ఈరోజు ఆమె తన సినిమా ప్రమోషన్ లో పాల్గొంది. అయితే ఆశ్చర్యకరంగా ఆమె తాళి తీసేయలేదు. మెడలో తాళిబొట్టు కనిపిస్తోంది.

రెడ్ కలర్ మోడ్రన్ డ్రెస్ వేసుకున్న కీర్తిసురేష్, మెడలో పసుపు తాడుతోనే ప్రచారానికి హాజరైంది. అంతేకాదు, ఆమె చేతికి పెట్టిన మెహందీ, కాళ్ల పారాణి కూడా ఇంకా అలానే ఉంది.

నిజానికి పెళ్లితో సంబంధం లేకుండా తన సోషల్ మీడియా పేజీలో సినిమా ప్రచారం చేస్తూనే ఉంది కీర్తిసురేష్. కేవలం పెళ్లి రోజు మాత్రమే గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు పెళ్లయిన వెంటనే ప్రచారంలోకి దూకేసింది.

సాధారణంగా సినిమాకు 2 కోట్ల రూపాయలు తీసుకుంటుందట కీర్తిసురేష్. తన తొలి హిందీ సినిమాకు మాత్రం ఆమె 4 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నట్టు బాలీవుడ్ మీడియా చెబుతోంది.

6 Replies to “మెడలో మంగళ సూత్రంతో కీర్తిసురేష్”

Comments are closed.