నన్ను ఎవ్వరూ కమిట్ మెంట్ అడగలేదు – కీర్తిసురేష్

హీరోయిన్ కీర్తిసురేష్, కాస్టింగ్ కౌచ్ పై స్పందించింది. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ సంస్కృతి ఉందని అంగీకరించిన ఈ బ్యూటీ, తనను మాత్రం ఇప్పటివరకు ఎవ్వరూ కమిట్ మెంట్ అడగలేదని, తనకు కాస్టింగ్ కౌచ్ అనుభవాలు…

హీరోయిన్ కీర్తిసురేష్, కాస్టింగ్ కౌచ్ పై స్పందించింది. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ సంస్కృతి ఉందని అంగీకరించిన ఈ బ్యూటీ, తనను మాత్రం ఇప్పటివరకు ఎవ్వరూ కమిట్ మెంట్ అడగలేదని, తనకు కాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురుకాలేదని అంటోంది.

ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది కీర్తిసురేష్. కాస్టింగ్ కౌచ్ అనేది ఎదుటి వ్యక్తిపైనే ఆధారపడి ఉండదని, మన ప్రవర్తన మీద కూడా ఆధారపడి ఉంటుందని అంటోంది. మనం సూటిగా, నిక్కచ్చిగా ఉంటే కాస్టింగ్ కౌచ్ ప్రతిపాదనలు రావంటోంది. తను కమిట్ మెంట్ కు ఓకే అనే టైపు కాదని, ఒకవేళ అలాంటి సందర్భమే ఎదురైతే, సినిమాలు మానేసి ఏదైనా జాబ్ చేసుకుంటానని అంటోంది.

ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు కలిసినప్పుడు కాస్టింగ్ కౌచ్ గురించి కూడా మాట్లాడుకుంటామని తెలిపింది కీర్తిసురేష్. అలా వినడమే తప్ప, తనకు ఎప్పుడూ అనుభవంలోకి రాలేదనేది కీర్తిసురేష్ మాట.

మరోవైపు ఈ ముద్దుగుమ్మ పెళ్లిపై 2 రోజులుగా పుకార్లు వస్తున్నాయి. ఆమె రీసెంట్ గా తన పూర్వీకులకు చెందిన గ్రామాన్ని సందర్శించింది. అక్కడ దేవాలయంలోని గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించింది. సాధారణంగా పెళ్లి చేసుకునేముందు ఇలాంటివి చేయడం కామన్. అందుకే కీర్తిసురేష్ పై ఒక్కసారిగా పెళ్లి పుకార్లు వ్యాపించాయి.

అయితే ఈ పుకార్లను కీర్తిసురేష్ టీమ్ ఖండించింది. ఆమె ఇప్పట్లో పెళ్లి చేసుకోదని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం కీర్తిసురేష్ దృష్టి మొత్తం సినిమాలపైనే ఉందంట. కేజీఎఫ్, కాంతర లాంటి పాన్ ఇండియా సినిమాల్ని అందించిన హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై కీర్తిసురేష్ ఓ సినిమా చేయబోతోంది. ఇక తెలుగులో నాని సరసన దసరా సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.