కీర్తిసురేష్ పెళ్లిపై పుకార్లు రావడం కొత్తేంకాదు. దాదాపు ఐదేళ్లుగా ఆమె పెళ్లిపై పుకార్లు వస్తూనే ఉన్నాయి. వాటిని ఆమెతో పాటు, ఆమె తల్లిదండ్రులు ఖండిస్తూనే ఉన్నారు. అయితే ఈసారి మేటర్ పెళ్లి శుభలేఖల వరకు వెళ్లింది.
అవును.. డిసెంబర్ 11న కీర్తిసురేష్ పెళ్లి చేసుకోబోతోందంటూ కథనాలు వస్తున్నాయి. గోవాలో ఆమె వివాహం జరగబోతోంది. అయితే ఈ మేటర్ ను ఆమె ఇంకా నిర్థారించలేదు.
తన చిన్ననాటి స్నేహితుడ్ని కీర్తిసురేష్ పెళ్లాడబోతోంది. అతడి పేరు ఆంటోనీ థటిల్. స్కూల్ డేస్ నుంచి వీళ్లిద్దరూ కలిసి చదువుకున్నారట. దాదాపు పదేళ్లుగా ఇద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని అంటున్నారు.
గమ్మత్తైన విషయం ఏంటంటే, గతంలో ఇతడ్నే ఆమె పెళ్లాడబోతోందంటూ కథనాలు వచ్చాయి. దుబాయ్ కు చెందిన వ్యాపారవేత్త ఇతడే. అయితే ఆ కథనాల్ని అప్పట్లో కీర్తిసురేష్ ఖండించింది. తన రహస్య ప్రేమికుడ్ని తనే స్వయంగా పరిచయం చేస్తానంది.
కట్ చేస్తే, ఇప్పుడు మళ్లీ మరోసారి అతడి పేరే తెరపైకి వచ్చింది. ఏకంగా గోవాలో పెళ్లి అంటూ వార్తలొస్తున్నాయి. ఇండస్ట్రీలో కొంతమందికి ఆల్రెడీ శుభలేఖలు కూడా అందించిందంట కీర్తిసురేష్.
So ooo Sad….
Celebrities yenni marriages aina chesukovachu
Marrying Rice bag convert
vc available 9380537747
vc available 9380537747