రాజకీయాలు వేరు, సినిమా వేరు అంటే ఇదేనా!

అంతా ఊహించినట్టుగానే మట్కా పరిస్థితి ఘోరంగా తయారైంది. కోట్లలో రావాల్సిన వసూళ్లు లక్షల రూపాయల్లోకి, లక్షల్లో రావాల్సిన చోట వేలల్లోకి రెవెన్యూ పడిపోయింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మట్కా వసూళ్లు దారుణంగా ఉన్నాయి. Advertisement…

అంతా ఊహించినట్టుగానే మట్కా పరిస్థితి ఘోరంగా తయారైంది. కోట్లలో రావాల్సిన వసూళ్లు లక్షల రూపాయల్లోకి, లక్షల్లో రావాల్సిన చోట వేలల్లోకి రెవెన్యూ పడిపోయింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మట్కా వసూళ్లు దారుణంగా ఉన్నాయి.

అప్పుడెప్పుడో ‘మహానాయకుడు’, ఆ తర్వాత ‘ఆఫీసర్’ సినిమాకు వచ్చిన రేంజ్ లో మట్కా కలెక్షన్లున్నాయి. వరుణ్ తేజ్ కెరీర్ లోనే అత్యల్ప వసూళ్లు ఇవి. మట్కా ప్రమోషన్ టైపులోనే చెప్పాలంటే.. వాసు తన ప్రామిస్ ను నిలబెట్టుకోలేకపోయాడు.

నిజానికి వరుణ్ తేజ్ కు ఫ్లాపులు కొత్త కాదు. గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్ సినిమాలన్నీ ఫ్లాపులే. అయితే ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టుగా మారుతున్నాయి వరుణ్ తేజ్ ఫ్లాపులు.

కనీసం మెగాభిమానులు, జనసైనికులు ఈ సినిమాను చూసినా ఇంత తక్కువ వసూళ్లు వచ్చి ఉండేవి కాదనేది ట్రేడ్ అభిప్రాయం. తెలుగు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో పవన్, చిరు అభిమానులున్నారు. వాళ్లు కూడా ఈ సినిమా వైపు కన్నెత్తి చూడలేదనే విషయం తెలుస్తూనే ఉంది. బహుశా, రాజకీయాలు వేరు, సినిమా వేరు అంటే ఇదేనేమో.

మట్కా సంగతి పక్కనపెడితే, వరుణ్ తేజ్ తన కెరీర్ పై మరింత సీరియస్ గా దృష్టి పెట్టాల్సిన సమయం మాత్రం వచ్చేసింది. అతడి థియేట్రికల్ మార్కెట్ మాత్రమే కాదు, నాన్-థియేట్రికల్ మార్కెట్ కూడా పడిపోయింది.

16 Replies to “రాజకీయాలు వేరు, సినిమా వేరు అంటే ఇదేనా!”

  1. Mega ani brand vesukoni local unqualified products ni release chesthe guddi ga vesukontara enti…janalu smart…chala choosy ga pick chestharu…bajana stage pine…theatre lo kaadu…pk sir movies ke dikku ledu…ika ee pilla pitrelu entha

  2. Im nutral fan of telugu movies..bavunte evari movie ina chuse rakam anamata…nandamuri ki jr ntr ne next varasudu..alane mega ki bunny…all remaining just come and go type..including meda son…vadi plastic mohaniki hero enti asalu .expressions less face charan di…edo mega board thoti bandi lagesaru..if hebis not mega then anybody gives him chanve??

    1. ఈ టైం లో.. నీ అమూల్యమైన.. VC ఆ ప్రొడ్యూసర్ కి… హీరో కి.. కుదిరితే… టీం మొత్తానికి అవసరం.

Comments are closed.