అత్యాచారాల‌పై ప్ర‌భుత్వం రొటీన్ డైలాగ్స్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఖ‌ర్మేంటో గానీ, వ‌రుస అత్యాచార ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. మ‌రీ ముఖ్యంగా కూట‌మి స‌ర్కార్ పాల‌న‌లో చిన్నారులు, మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు పెరిగాయ‌నే వాద‌న బ‌ల‌ప‌డుతోంది. స్వ‌యంగా డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణే అఘాయిత్యాలు అగ‌డం…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఖ‌ర్మేంటో గానీ, వ‌రుస అత్యాచార ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. మ‌రీ ముఖ్యంగా కూట‌మి స‌ర్కార్ పాల‌న‌లో చిన్నారులు, మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు పెరిగాయ‌నే వాద‌న బ‌ల‌ప‌డుతోంది. స్వ‌యంగా డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణే అఘాయిత్యాలు అగ‌డం లేదని, ప్ర‌జ‌లు తిడుతున్నార‌ని పిఠాపురం స‌భ‌లో బ‌హిరంగంగా ఆవేద‌న వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా విశాఖ‌లో లా విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జ‌ర‌గ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. మ‌రీ ముఖ్యంగా హోంశాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత సొంత జిల్లాలో ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డం విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. ఈ నేప‌థ్యంలో హోంశాఖ మంత్రి గ్యాంగ్ రేప్‌పై త‌న స‌హ‌జ ధోర‌ణిలో రియాక్ట్ అయ్యారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మంత్రి తెలిపారు. అలాగే అత్యాచారానికి పాల్ప‌డ్డ యువ‌కుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆమె హెచ్చ‌రించారు.

ఈ ఘ‌ట‌న‌పై విశాఖ పోలీస్ క‌మిష‌న‌ర్‌తో మాట్లాడిన‌ట్టు మంత్రి తెలిపారు. వివ‌రాలు అడిగి తెలుసుకున్న‌ట్టు ఆమె వెల్ల‌డించారు. బాధిత కుటుంబానికి ప్ర‌భుత్వం అండ‌గా వుంటుంద‌ని అనిత తెలిపారు. విశాఖలో ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని మంత్రి రొటీన్ డైలాగ్ చెప్పార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

వ‌రుస అత్యాచారాలు జ‌రుగుతున్న‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం అదుపు చేయ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మైంద‌నే చెడ్డ‌పేరు తెచ్చుకుంది. చివ‌రికి ఉప ముఖ్య‌మంత్రే స్వ‌యంగా హోంశాఖ మంత్రి, పోలీస్ అధికారుల‌పై విమ‌ర్శ‌లు చేసే ప‌రిస్థితి. అలాంట‌ప్పుడు ప్ర‌తిప‌క్ష పార్టీ ఊరికే వుంటుందా?

15 Replies to “అత్యాచారాల‌పై ప్ర‌భుత్వం రొటీన్ డైలాగ్స్‌”

  1. AP ప్రజలకు 2019 నుంచి 2024 వరకు sani గాడు పట్టాడు ..

    veedi ప్రభావం ఇంకా ఉంది త్వరలోనే anni సరి చేస్తాం..

    1. The govt and police should show their mettle and do not keep barking at Jagan for your failures. This kind of heinous crimes never happened in Jagan’s regime. Have some conscience…

      1. You are expecting too much.. If you observe, majority of crimes happened due to the reason that they will get support from local leaders.. so, they can escape. So, when culprits get such confidence, there is nothing that any body can do..

  2. బద్దలైన మరో ఘోర అబద్దం ..

    .

    గత ప్రభుత్వ హుయాంలో రంగులు వెయ్యడానికి 3000 కోట్లు అని ప్రచారం చేశారు…

    .

    5 ఏళ్లలో మొత్తం ఖర్చు పెట్టింది 102 కోట్లు అని ఇవ్వాళ అసెంబ్లీ లో డీసీఎం చెప్పారు..

    .

    ఎంత మోసం? గత అయిదేళ్లలో ఎన్ని గొర్రెలు కామెంట్స్ పెట్టాయో లెక్కలేదు..

    .

    ఈ అబద్దాన్ని…

    .

    నమ్మిన గొర్రెలు ఇప్పుడేమంటాయో…

Comments are closed.