వివేకా హ‌త్య కేసులో అవినాష్‌కు సుప్రీం నోటీసులు

త‌న తండ్రి హ‌త్య కేసులో ఎలాగైనా క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని జైలుకు పంపాల‌నే ప‌ట్టుద‌ల‌తో డాక్ట‌ర్ సునీత న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అవినాష్‌రెడ్డి బెయిల్ ర‌ద్దు చేయాల‌ని కోరుతూ సునీత…

త‌న తండ్రి హ‌త్య కేసులో ఎలాగైనా క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని జైలుకు పంపాల‌నే ప‌ట్టుద‌ల‌తో డాక్ట‌ర్ సునీత న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అవినాష్‌రెడ్డి బెయిల్ ర‌ద్దు చేయాల‌ని కోరుతూ సునీత వేసిన పిటిష‌న్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది. చీఫ్ జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది.

సునీత త‌ర‌పు ప్ర‌ముఖ న్యాయ‌వాది సిద్ధార్థ‌లూథ్రా వాద‌న‌లు వినిపించారు. అవినాష్‌రెడ్డితో పాటు మ‌రో నిందితుడు శివ‌శంక‌ర్‌రెడ్డి కుమారుడికి స‌ర్వోన్న‌త న్యాయ స్థానం నోటీసులు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం. అప్రూవ‌ర్‌గా మారిన ద‌స్త‌గిరిని శివ‌శంక‌ర్‌రెడ్డి కుమారుడు డాక్ట‌ర్ చైత‌న్య జైలుకు వెళ్లి బెదిరించార‌ని కోర్టు దృష్టికి సునీత త‌ర‌పు న్యాయ‌వాది తీసుకెళ్లారు. డాక్ట‌ర్ చైత‌న్య నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా జైలుకు వెళ్లిన‌ట్టు సిద్దార్థ్‌లూథ్రా కోర్టుకు తెలిపారు.

పిటిష‌న‌ర్ సునీత త‌ర‌పు న్యాయ‌వాది ఈ కేసులో డాక్ట‌ర్ చైత‌న్య‌, రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌తివాదులుగా చేర్చాల‌ని కోరారు. ఇందుకు చీఫ్ జ‌స్టిస్ ధ‌ర్మాస‌నం అంగీక‌రించింది. అవినాష్‌రెడ్డితో పాటు డాక్ట‌ర్ చైత‌న్య‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేస్తూ, విచార‌ణ‌ను వ‌చ్చే ఏడాది మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది.

ఈ కేసులో ఇప్ప‌టికే కొంద‌రు నిందితులకు బెయిల్ మంజూరైంది. వాళ్లంతా బ‌య‌ట ఉన్నారు. 8వ నిందితుడైన క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి బెయిల్‌పై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో అనే ఉత్కంఠ కొన‌సాగుతోంది.

13 Replies to “వివేకా హ‌త్య కేసులో అవినాష్‌కు సుప్రీం నోటీసులు”

  1. ఎంకటి..ఎలాగైనా జైలు కి పంపాలనే పట్టుదలతో నా?

    ఎలాగైనా నేరస్తుడు జైలు కి వెళ్లకూడదనే వైఎస్ ఫ్యామిలీ నేర చెరిత్ర రూల్ బుక్ పట్టుదలతో నా?

  2. ఎంకటి..ఎలాగైనా-జైలు-కి-పంపాలనే-పట్టుదలతో-నా?

    ఎలాగైనా-నేరస్తుడు-జైలు-కి-వెళ్లకూడదనే-వైఎస్ -ఫ్యామిలీ-నేర-చరిత్ర-రూల్-బుక్-పట్టుదలతో-నా?

  3. బద్దలైన మరో ఘోర అబద్దం ..

    .

    గత ప్రభుత్వ హుయాంలో రంగులు వెయ్యడానికి 3000 కోట్లు అని ప్రచారం చేశారు…

    .

    5 ఏళ్లలో మొత్తం ఖర్చు పెట్టింది 102 కోట్లు అని ఇవ్వాళ అసెంబ్లీ లో డీసీఎం చెప్పారు..

    .

    ఎంత మోసం? గత అయిదేళ్లలో ఎన్ని గొర్రెలు కామెంట్స్ పెట్టాయో లెక్కలేదు..

    .

    ఈ అబద్దాన్ని…

    .

    నమ్మిన గొర్రెలు ఇప్పుడేమంటాయో…

    1. పోస్టులు పెట్టిన వాళ్ళు కాదు గొర్రెలు… ప్రతిపక్షం అభియోగం చేస్తే అధికారం లో ఉండి కూడా సన్నాసులు గా వున్న వైసీపీ నాయకులు

    2. మరి అప్పట్లోనే జమ ఖర్చులు పారదర్శకంగా శ్వేత పత్రం విడుదల చేస్తే బాగుండేది కదా… ఇప్పుడు చేతులు పిసుక్కుంటే ఏం లాభం? అంటే చేసిన ఖర్చు కూడా సరిగా బయటికి చెప్పలేని అసమర్ధులా మన నాయకులు?

    3. వాడు చెప్పింది ఒక నియోజక వర్గానికి రంగులు వేసి తీసినందుకు అయినా మొత్తం ఖర్చు రాష్ట్రానికి కాదు , సుప్రీం కోర్ట్ చెప్పిన తీర్పులో ఉంది చూడు రంగులు వేయటానికి 3 వేల కోట్లు , మల్ల అవి తీయటానికి ఇంకో 3 వేల కోట్లు , మొత్తం 6 వేల కోట్లు వృధా చేసాడు నీచుడు జగన్ రెడ్డి

Comments are closed.