ఈ చట్టంతో చంద్రబాబు సాధించేది సున్నా!

దంపతులకు పుట్టే రెండో బిడ్డకు, మూడో బిడ్డకు ప్రత్యేకంగా ఏమైనా ఇన్సెంటివ్స్ ను ప్రభుత్వపరంగా ప్రకటిస్తే ఏమైనా అదనపు ప్రయోజనం ఉండవచ్చు.

చంద్రబాబు నాయుడు కొన్ని కొత్త ఆలోచనలు చేస్తుంటారు. చాలా సబబుగా కనిపించే ఆలోచనలు. దేశానికి ఉపయోగపడేవిగా కనిపించే ఆలోచనలు. అలాంటి ఆలోచనల్లో ఒకటి.. ‘మనదేశంలో జననాల రేటు పెరగాలి’ అనే వాదన తెరపైకి తేవడం.

దేశంలో జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ యువత చాలా తక్కువగా ఉన్నదని.. అందువల్ల ఉత్పాదకత తగ్గుతున్నదని.. యువతరం అత్యధికంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని, చైనా, జపాన్ లు ఎక్కువ మంది పిల్లలను కనడాన్ని ఇప్పుడు ప్రోత్సహిస్తున్న పరిస్థితికి రాకముందే మనం మేలుకోవాలని ఆయన అంటున్నారు. అందువల్ల జననాల రేటు పెరగడం ఒక్కటే మార్గమని.. మనదేశం నుంచి కోట్ల మందిని విదేశాల్లో ఉద్యోగాలకు అందించే పరిస్థితి రావాలని ఆయన అంటున్నారు.

యువత పెరగాలి.. యువ మానవవనరులు పెరిగితే అన్ని రకాలుగా అభివృద్ధికి అది కారణం అవుతుంది అనేది చంద్రబాబు మాట. ఇటీవల ఢిల్లీలో హిందూస్థాన్ టైమ్స్ వారి కార్యక్రమంలో కూడా చంద్రబాబు ఈ మాట చెప్పారు.

ఈ వాదన సబబుగానే అనిపిస్తుంది. ఎవరికైనా భిన్నాభిప్రాయాలు కూడా ఉండొచ్చు. ఆ చర్చను పక్కన పెడితే.. తను నమ్మిన ఈ వాదన కోసం చంద్రబాబు చేస్తున్న కంట్రిబ్యూషన్ ఏమిటి? తాను ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఈ జననాల రేటును పెంచడానికి ఆయన ఏం చేయబోతున్నారు. ఎలాంటి వినూత్నమైన నిర్ణయాలతో, విధానాలతో యువ దంపతుల్లో ఇద్దరు లేదా అంతకంటె ఎక్కువ మంది పిల్లలు కలగాలనే కోరికను ప్రోత్సహించబోతున్నారు? ఇలాంటి ప్రశ్నలు వేసుకున్నప్పుడు మాత్రం అంత గొప్ప సమాధానాలు దొరకడం లేదు.

చంద్రబాబు ఈ దిశగా ఇప్పటిదాకా తీసుకున్న గొప్ప నిర్ణయం ఏమిటయ్యా అంటే.. పంచాయతీ ఎన్నికల్లో ఇద్దరి కంటె ఎక్కువ పిల్లలు ఉన్నవారు పోటీచేయడానికి అనర్హులుగా సూచించే అంశాన్ని రద్దు చేస్తూ ఆ చట్టాన్ని సవరించడం మాత్రమే. ఈ ఒక్క చర్యతో ఎన్ని కుటుంబాల్లో అవగాహన పెరుగుతుంది? ఎన్ని లక్షల కోట్ల కొత్త జననాలు సాధ్యమవుతాయి.

రాష్ట్రంలో ఉండేది 13వేల పైచిలుకు పంచాయతీలు. వీటి పాలకులుగా పదవులు కోరుకునే వారికి తప్ప ఈ చట్టసవరణ బిల్లుతో ఎవ్వరికీ పనిలేదు. నిజానికి ముగ్గురున్నా కూడా అర్హులే అనడం తప్ప, ఒకరో ఇద్దరో ఉంటే అనర్హులని ఈ సవరణ కూడా చెప్పడం లేదు. అదే సమయంలో హిందూస్థాన్ టైమ్స్ కార్యక్రమంలో.. ఇద్దరి కంటె తక్కువ ఉంటే అనర్హులు చేయాలని చంద్రబాబు తన అభిప్రాయం చెప్పారు. ఇలాంటి చట్టసవరణ వల్ల సాధించేది ఏమీ ఉండదు. మహా అయితే ఓ యాభైవేల కుటుంబాల్లో కొంత అవగాహన మాత్రమే.

అలా కాకుండా.. దంపతులకు పుట్టే రెండో బిడ్డకు, మూడో బిడ్డకు ప్రత్యేకంగా ఏమైనా ఇన్సెంటివ్స్ ను ప్రభుత్వపరంగా ప్రకటిస్తే ఏమైనా అదనపు ప్రయోజనం ఉండవచ్చు. అలాంటి క్రియాశీల ఆలోచనల జోలికి వెళ్లకుండా ఏదో మొక్కుబడిగా చేశామన్నట్టుగా చెప్పుకోడానికి ఇలాంటి చట్టసవరణ పనికి వస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

28 Replies to “ఈ చట్టంతో చంద్రబాబు సాధించేది సున్నా!”

  1. పిల్లలని ఎక్కువ కంటే తప్పనిసరి ఉద్యోగాలు వచ్చే ఏర్పాటు ఏమైనా చెయ్యగలరా?

  2. జనం ఆ స్టేజి దాటిపోయారు ..

    లైఫ్ స్టైల్ మారిపోయి చాలా కాలం అయింది

  3. ఇద్దరికంటే తక్కువ ఉంటె అనర్హులు గా చెయ్యాలా ?తనకి ఇంపాక్ట్ లేకుండా ఏమైనా చెయ్యగల ఘనుడు

  4. బాబు చాలా ముందు చూపు ఉన్న గొప్ప నాయకుడు.. ఈ ఇద్దరు ముద్దు అన్నది ఒక కుట్ర…

  5. already manufacturing sector started using robots . service sector also downsizing manpower and using automation in many places . gov are struggling to provide employment & basic needs of the people .

    CBN just copy & paste the statements given by big people like i different countries . he don’t has any knowledge to think wisely whether it is useful for India or not .

  6. then why leaders is not implementing in their home even they are in good in financially. in middle class and lower middle class how we can afford, now education and health is not easy to afford already we suffering with no job security.

  7. . Even babu has only one son…Why nara lokesh has got only one kid inspite of having multi crore properties.. First teach and follow in your house.. Stop preaching others.. So called visionary

  8. మనం ఆచరించాలి…కనీసం వారసులు దాన్ని ఆచరించెట్టు హుఉడాలి…అవన్నీ వదిలే సేఫ్ కార్నర్ ఉంది ఎవ్వరైనా లెక్చర్ ఇవ్వొచ్చు

  9. ఆ సెమినార్ లో బాబు చెప్పింది జనాభా నిర్వహణ (population management) గురించి. అంతేగానీ జనాభా విపరీతంగా పెంచాలి అనికాదు. ఆ నిర్వహణ సరిగ్గా జరగలేదు కాబట్టే నార్త్ ఇండియా లో ఎక్కువ సౌత్ లో తక్కువగానూ జనాభా వున్నారు ప్రస్తుతం. ఆ నిష్పత్తి ప్రకారం ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ లో జనాభా మన ప్రస్తుత, భవిష్యత్తు పారిశ్రామిక వ్యవసాయ అవసరాలకు సరిపడా వుండరు.

    GA, నువ్వు సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ టైప్ అయివుండాలి, ఏదైనా సగం వినటమే చిరాకు ఆ క్యారెక్టర్ కి.

    జర్నలిజం లో వున్నావు, పూర్తిగా తెలుసుకొని, విశ్లేషించి ఆర్టికల్స్ రాయటం నేర్చుకో ఇప్పటికైనా.

  10. ఆ సెమినార్ లో బాబు చెప్పింది జనాభా నిర్వహణ (population management) గురించి. అంతేగానీ జనాభా విపరీతంగా పెంచాలి అనికాదు. ఆ నిర్వహణ సరిగ్గా జరగలేదు కాబట్టే నార్త్ ఇండియా లో ఎక్కువ సౌత్ లో తక్కువగానూ జనాభా వున్నారు ప్రస్తుతం. ఆ నిష్పత్తి ప్రకారం ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ లో జనాభా మన ప్రస్తుత, భవిష్యత్తు పారిశ్రామిక వ్యవసాయ అవసరాలకు సరిపడా వుండరు.

    నువ్వు సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ టైప్ అయివుండాలి, ఏదైనా సగం వినటమే చిరాకు ఆ క్యారెక్టర్ కి.

    జర్నలిజం లో వున్నావు, పూర్తిగా తెలుసుకొని, విశ్లేషించి ఆర్టికల్స్ రాయటం నేర్చుకో ఇప్పటికైనా.

    1. Already Indian population is beyond the level of these two aspects……Population Management or Population Control….better to know and create awareness about the quality of Life in india….lol

  11. ఇప్పుడే కదా ఐడియా వచ్చింది…అప్పుడే వంకలా. జనాభా పెరగాలంటే 1-2 తరాలు పడుతుంది.

  12. మన వాళ్ళు కోట్లలో విదేశాలలో ఉద్యోగాలు చెయ్యాలి….ఇక ఈ perception మారలేమో. ఆ ఇన్నోవేషన్ ఎదో ఇండియా లో జరిగితే, జనాలకి ఉపయోగం, దేశానికీ ఉపయోగం

    1. మన తెలివితేటలన్ని ఉపయోగించి ఎవడో నాయకుడికో, ఏ హీరోకో సపోర్టు చేయడానికి ఖర్చు అయిపోతుంది.

      కాస్తో కూస్తో బుర్ర ఉన్నవాళ్లు ఇక్కడ అరాచక శక్తుల నుండి పారిపోయి విదేశాల్లో దర్జాగా బతుకుతున్నారు.

      ఇంక ఇన్నోవేషన్ ఎక్కడ జరుగుతుంది.

  13. Families should change their strategy form non or one to three or four. But it is extremely difficult to raise 4 kids in the current nuclear families. Govt first should start giving paid maternity leave for both the parents for a year or two, child support till they become 5, free education till high school, encouraging savings for higher studies by contributing at least 20% of deposits, tax rebate for first home buyers etc. Western countries implemented these several decades ago, we are not even thinking in those lines.

  14. జనాభా పెరుగుతోంది.. కానీ ఆ వర్గం పేదవారి జనాభా మాత్రమే బాగా పెరుగుతోంది.. వారికి ఈ ఉన్న వారి డబ్బు ముక్కుపిండి వసూలు చేసి పంచుతున్నారు.. అందుకే ఈ వర్గానికి చెందిన.. నిజయతీగా పన్ను కట్టే.. ఉత్తమ ఉన్నత జనాలు దేశం వదిలి వలస వెళుతున్నారు.. బాబు ఉద్దేశం.. చింత.. సందేశం.. ఈ పనికి వచ్చే జనాల గురించి…

Comments are closed.