కూటమి అభ్యర్థిని గెలిపించలేదని ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. వైఎస్సార్ జిల్లా బద్వేలు టికెట్‌ను బీజేపీ అభ్యర్థి రోశన్నకు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గమైన బద్వేలు టీడీపీ అభ్యర్థిగా అంత వరకూ ప్రచారంలో ఉన్న రోశన్న రాత్రికి రాత్రే బీజేపీ తరపున బరిలో నిలిచారు.
బీజేపీ అభ్యర్థిని గెలిపించే బాధ్యత మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, ఆమె తనయుడు, బద్వేలు టీడీపీ ఇన్‌చార్జ్ రితేష్‌రెడ్డిపై ఉంచారు. కూటమి సునామీలో కూడా అక్కడ వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ గెలుపొందారు. దీంతో విజయమ్మ కుటుంబంపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారని తెలిసింది. కూటమి అధికారంలో ఉన్నప్పటికీ విజయమ్మ, ఆమె కుమారుడు రితీష్‌రెడ్డి చిన్న పని కూడా చేయించుకోలేకపోతున్నారని తెలిసింది.
ప్రజల్లో పలుకుబడి లేని విజయమ్మ, ఆమె కుమారుడు ఏం చెప్పినా చేయకూడదని ఉన్నతాధికారులకు ప్రభుత్వ పెద్దల నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లినట్టు తెలిసింది. అధికారంలో ఉన్నా, ప్రతిపక్ష నాయకుల కంటే హీనమైన బతుకైందని విజయమ్మ వాపోతున్నారని సమాచారం.
టీడీపీ కార్యకర్తలకు ఏ పనీ చేయలేకపోతున్నామని బద్వేలు టీడీపీ ఇన్‌చార్జ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం బద్వేలులో కూటమి అభ్యర్థిని గెలిపించలేదన్న కారణంతోనే తమను చంద్రబాబు పక్కన పెట్టారని వారు చెబుతున్నారు.
ప్రతిపక్ష నాయకులది హీనమైన బ్రతుకా?? అందుకేనా జగ్గస్ ప్రతిపక్ష నాయకుడి హోదా కావాలని మారాం చేస్తున్నాడు?
vc estanu 9380537747
vc available 9380537747
బద్దలైన మరో ఘోర అబద్దం ..
.
గత ప్రభుత్వ హుయాంలో రంగులు వెయ్యడానికి 3000 కోట్లు అని ప్రచారం చేశారు…
.
5 ఏళ్లలో మొత్తం ఖర్చు పెట్టింది 102 కోట్లు అని ఇవ్వాళ అసెంబ్లీ లో డీసీఎం చెప్పారు..
.
ఎంత మోసం? గత అయిదేళ్లలో ఎన్ని గొర్రెలు కామెంట్స్ పెట్టాయో లెక్కలేదు..
.
ఈ అబద్దాన్ని…
.
నమ్మిన గొర్రెలు ఇప్పుడేమంటాయో…