చేత‌నైతే విచారించుకోండి… బుర‌ద‌చ‌ల్లొద్దు!

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిపై అన‌వ‌స‌ర విమ‌ర్శ‌లు చేయొద్ద‌ని, చేత‌నైతే విచారించుకోవాల‌ని, బుర‌ద చ‌ల్లొద్ద‌ని వైసీపీ ఎమ్మెల్సీలు ఘాటుగా స్పందించారు. శాస‌న‌మండ‌లిలో మ‌ద‌న‌ప‌ల్లె స‌బ్ క‌లెక్ట‌రేట్‌లో అగ్ని ప్ర‌మాదం సంభ‌వించి రెవెన్యూ ఫైళ్లు ద‌గ్ధం…

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిపై అన‌వ‌స‌ర విమ‌ర్శ‌లు చేయొద్ద‌ని, చేత‌నైతే విచారించుకోవాల‌ని, బుర‌ద చ‌ల్లొద్ద‌ని వైసీపీ ఎమ్మెల్సీలు ఘాటుగా స్పందించారు. శాస‌న‌మండ‌లిలో మ‌ద‌న‌ప‌ల్లె స‌బ్ క‌లెక్ట‌రేట్‌లో అగ్ని ప్ర‌మాదం సంభ‌వించి రెవెన్యూ ఫైళ్లు ద‌గ్ధం అయ్యాయి. ఈ ఘ‌ట‌న‌ను ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుంది.

ఈ విష‌య‌మై ఇవాళ శాస‌న‌మండ‌లిలో చ‌ర్చ జ‌రిగింది. చ‌ర్చ‌లో భాగంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి పేరును రెవెన్యూశాఖ మంత్రి అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ ప్ర‌స్తావించారు. మండ‌లిలో స‌భ్యుడు కాని పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి పేరును తెర‌పైకి తేవ‌డంపై వైసీపీ స‌భ్యులు అడ్డుకున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పెద్దిరెడ్డి పేరును రికార్డుల్లోంచి తొల‌గించాల‌ని మండ‌లిలో వైసీపీ ప‌క్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ డిమాండ్ చేశారు.

సీఐడీ విచార‌ణ జ‌రుగుతుండ‌గా, ఏకంగా పెద్దిరెడ్డిని నిందితుడిగా మంత్రి పేర్కొన‌డం ఏంట‌ని బొత్స నిల‌దీశారు. ఉద్దేశ‌పూర్వ‌కంగానే పెద్దిరెడ్డి పేరును ప్ర‌స్తావించార‌ని బొత్స మండిప‌డ్డారు.

ప్ర‌భుత్వానికి చేత‌నైతే మ‌ద‌న‌ప‌ల్లె ఘ‌ట‌న‌లో స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపి, బాధ్యుల‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బొత్స కోరారు. ఈ సంద‌ర్భంగా మండ‌లి చైర్మ‌న్ మోష‌న్‌రాజు స్పందిస్తూ స‌భ‌లో లేని స‌భ్యుల పేర్లు ప్ర‌స్తావించ‌కుండా మాట్లాడాల‌ని మంత్రి అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్‌కు హిత‌వు చెప్పారు.

2 Replies to “చేత‌నైతే విచారించుకోండి… బుర‌ద‌చ‌ల్లొద్దు!”

Comments are closed.