ఎంత అందం ఉన్నప్పటికీ, ఆవగింజంత అదృష్టం చాలా అవసరం. కేతిక శర్మ విషయంలో ఇది పచ్చి నిజం. ఈ బ్యూటీని అంతా లైక్ చేస్తారు. అవకాశాలు కూడా అలానే ఇస్తున్నారు. కానీ అదృష్టం ఆమె వైపు లేదు. దీంతో ఇన్నేళ్లయినా ఆమె సక్సెస్ చూడలేదు. చివరికి పవన్ కల్యాణ్ కూడా ఆమెను కాపాడలేకపోయాడు.
ఊహించని విధంగా బ్రో సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది కేతిక. ఎంతోమంది ముద్దుగుమ్మలు క్యూ కట్టినప్పటికీ, ఆమెకు అవకాశం వచ్చింది. పవన్ తో సీన్స్ లేకపోయినా, పవన్ సినిమా కావడంతో కేతిక చాలా హోప్స్ పెట్టుకుంది. కానీ బ్రో సినిమా ఆమెకు హిట్ ఇవ్వలేకపోయింది.
కెరీర్ స్టార్ట్ చేసినప్పట్నుంచి ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా కొట్టలేదు కేతిక. రొమాంటిక్ అనే సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత లక్ష్య, రంగరంగ వైభవంగా సినిమాలు చేసింది. తాజాగా బ్రో సినిమాలో కూడా నటించింది. ఇవేవీ ఆమెకు అదృష్టాన్ని అందించలేకపోయాయి.
ప్రస్తుతానికైతే కేతికకు అవకాశాలొస్తున్నాయి. కానీ ఆమెకు అర్జెంట్ గా ఓ హిట్ పడాలి. ఎంత తొందరగా సక్సెస్ వస్తే, ఆమె కెరీర్ కు అంత మంచిది. ఏ హీరో నుంచి ఆమెకు అదృష్టం వరిస్తుందో చూడాలి.